Ambati Rayudu : అంబటి రాయుడి కోసం వైసీపీ బిగ్ ప్లాన్ రెడీ? డ్యూయల్ రోల్ తప్పదా!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పలు సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విషయంలో వైసీపీ బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు సేవల్ని రెండు విధాలుగా వాడుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.

క్రికెట్ కు గుడ్ బై చెప్పకముందే వైసీపీకి మద్దతుగా, సీఎం జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టిన అంబటి రాయుడు.. ఆ తర్వాత ఆయన్ను నేరుగా వచ్చి పలుమార్లు కలిశారు. ఇందులో వీరిద్దరూ పలు అంశాల్ని చర్చించారు. అందులో అంబటి రాయుడిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి, అలాగే ఆయన సేవల్ని పార్టీకి ఏ విధంగా వాడుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల సారాంశంపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.

ys jagan prepares big plan to utilize former cricketer ambati rayudus services for ysrcp

ఏపీలో ప్రస్తుతం కులాల పోరు తీవ్రమవుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీ వైపు మొగ్గిన కాపు సామాజిక వర్గం ఈసారి ఎటువైపు ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కారణంగా కాపు యువత ఆయనవైపు మొగ్గు చూపుతారా, జనసేనతో పాటు టీడీపీకి ఇది ఏమాత్రం ఉపయోగపడుతోందనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని తమ పార్టీవైపు ఆకర్షించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

అంబటి రాయుడిని వచ్చే ఎన్నికల్లో కాపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్టార్ క్యాంపెయినర్ గా తిప్పడంపై వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్, వంగవీటి రాధా రూపంలో ఇద్దరు కాపు నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో ఉండటం, వారు నిత్యం చేసే వ్యాఖ్యలు ఆయా పార్టీలతో పాటు కాపుల్లోనూ చర్చనీయాంశమవుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాయుడిని స్టార్ క్యాంపెయినర్ గా వైసీపీ ఎంచుకోవచ్చని తెలుస్తోంది.

అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం నుంచి రాయుడిని నిలబెట్టడంపైనా వైసీపీ రిపోర్టులు తెప్పించుకుంటోంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాయుడు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. వైసీపీకి మద్దతుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పోటీ కోసం ఆయన గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైతే ఆయన్ను గుంటూరు ఎంపీ సీటు నుంచి నిలబెట్టేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+