YS Jagan: శ్రీలంక చేసే బడ్జెట్-సూపర్ సిక్స్ తప్పించుకోవడానికే- వైఎస్ జగన్ ఫైర్..

ఏపీ శ్రీలంక అయిపోతుందంటూ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటి కూటమి నేతలు వైసీపీ హయాంలో చేసిన ప్రచారాన్ని మాజీ సీఎం జగన్ ఇవాళ మరోసారి గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారంటూ వారిని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరునెలలు అవుతుంటే ఇప్పుడు బడ్జెట్ ను నామమాత్రంగా ప్రవేశపెట్టారని ఆరోపించారు. గతంలో కూటమి నేతలు చెప్పిన మాటల్ని జగన్ గుర్తు చేశారు.

ys jagan press slams Chandrababu pawan kalyan over budget recollect their past remarks

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమకు అనుకూలమైన ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని తప్పించుకునేందుకు శతవిథాలా ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టలేక ఓటాన్ బడ్జెట్ పెట్టి తప్పించుకున్నారని విమర్శించారు. నటనలో చంద్రబాబు మామ ఎన్టీఆర్ ను మించిపోయారన్నారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని వీరంతా విమర్శలు చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని నిరూపించలేక తేలిపోతున్నారని జగన్ విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదనే అలాంటి విమర్శలు చేశారన్నారు. తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు నాలుగున్నర లక్షల కోట్లని, గ్యారంటీ ఇచ్చినవి మరో లక్షన్నర కోట్లన్నారు. మొత్తం చూసినా 6 లక్షల కోట్లని ఇప్పుడు బడ్జెట్ లోనే చూపించారన్నారు. అప్పట్లో 14 లక్షలని చెప్పి ఇప్పుడు 6 లక్షలే అని చూపించారన్నారు. దీన్ని బట్టి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిందో చెప్పాలన్నారు.

వాస్తవాలు ఇలా ఉన్నా చంద్రబాబు అబద్దాలు మాత్రం ఆగడం లేదని జగన్ ఆక్షేపించారు. చెల్లించాల్సిన బిల్లులున్నాయి, కాయిలున్నాయంటూ చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నట్లు చెప్తున్నారని తెలిపారు. ప్రతీ ప్రభుత్వంలో, ప్రతీ సంవత్సరంలో బిల్లులు అప్ లోడ్ అవుతాయని, వాటిలో పెండింగ్ ఉంటాయన్నారు. తాను దిగిపోతూ తమకు ఎన్ని వేల కోట్ల బిల్లులు బకాయిపెట్టి పోయారో జగన్ గణాంకాలతో సహా వివరించారు. అందులో డిస్కంల బకాయిలే 21541 కోట్లు ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+