రూ.22వేల కోట్లు అత్తగారి సొత్తా, బాబుది జైలుకు వెళ్లే నేరం: జగన్ రివర్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసింది చట్ట ప్రకారం జైలుకు వెళ్లే నేరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం జగన్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే సమయంలో వైసిపి డివిజన్ కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేసింది. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. తాము బిల్లును వ్యతిరేకిస్తూ డివిజన్ కోరామని చెప్పారు.
రూ.22వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వాటిని వాడుకున్నారని చెప్పారు. కేంద్రం, ఆర్బీఐ అంగీకరించకున్నా పబ్లిక్ డిపాజిట్లను తన అత్తగారి సొత్తు అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకున్నారని ధ్వజమెత్తారు.

డివిజన్ కోరేందుకు ఇంతకన్నా ఏం కారణం కావాలని ప్రశ్నించారు. చంద్రబాబు చేసింది చట్ట ప్రకారం జైలుకు వెళ్లే నేరమని చెప్పారు. బిల్లును తాము అందుకే వ్యతిరేకించామని చెప్పారు. 2014-15 ఆడిట్ లెక్కలను బడ్జెట్లో చూపించలేదన్నారు. రూ.22వేల కోట్లు పక్కదారి పట్టినందువల్లే వాటిని బడ్జెట్లో చూపించలేదని ఆరోపించారు.
డివిజన్ అడిగితే రాజ్యాంగ నిబంధన ప్రకారం ఇవ్వాలన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆ స్థానాన్ని అగౌరవపరిచారని చెప్పారు. అవినీతి సొమ్ముతో టిడిపి కొన్న ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నాలు చేశారన్నారు. ఇది వైసిపికి నైతిక విజయమని చెప్పారు.
కాగా, 2014 సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పైన వేటు వేయించే ఉద్దేశ్యంలో భాగంగానే జగన్ మొన్న రెండుసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లు పై డివిజన్ కోరారనే వాదనలు ఉన్నాయి.
అయితే, జగన్ మాత్రం తాము ఎమ్మెల్యేల కోసం విప్ జారీ చేయలేదని, ద్రవ్య వినిమయ బిల్లు విషయమై డివిజన్ కోరలేదని అభిప్రాయపడుతున్నారు. రూ.22వేల కోట్లు పక్కదారి పట్టినందువల్లే తాము డివిజన్ కోరామని చెబుతున్నారు. గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల కోసమే తాము దీనిని ప్రతిపాదించినట్లు జగన్ చెప్పారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications