జగన్, రఘురామ పోరుతో కేంద్రం ట్విస్ట్ లు-సీబీఐ కేంద్రంగా-బీజేపీపై పోరు వెనుక ?
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేరుకుంది. ఇప్పటికే జగన్, సాయిరెడ్డిపై సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లతో పాటు ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు చేయగా.. ఆయనపై వారు కూడా ఫిర్యాదులు చేశారు. దీనిపై తాజాగా స్పందిస్తున్న కేంద్రం ఒక్కొక్కటిగా ఫిర్యాదులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వీరు పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదుల తాజా స్ధితిని వెల్లడించింది.

జగన్, సాయిరెడ్డి వర్సెస్ రఘురామ
వైసీపీ నుంచి గెలిచి తమపైనే ధిక్కారం ప్రదర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుపై సీఐడీతో రాజద్రోహం కేసులు పెట్టించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత ఆయన్ను మరింత టార్గెట్ చేస్తోంది. రఘురామపై అనర్హత వేటు కోరుతూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి నోటీసులు కూడా ఇప్పించగలిగింది. వీటికి రఘురామ ఇచ్చే వివరణ ఆధారంగా ఆయన భవిష్యత్తు నిర్ణయం కానుంది. ఈ దశలో రఘురామకు చెందిన కంపెనీల్ని టార్గెట్ చేస్తూ సీబీఐని ఉసిగొల్పే పనిలో విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నారు. దీంతో ఢిల్లీలో జగన్ వర్సెస్ రఘురామ పోరు సీబీఐ కేంద్రంగా మారిపోతోంది.

రఘురామ పిటిషన్లు
వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో జగన్ బెయిల్ రద్దు కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. సీబీఐ కోర్టు ఈనెల 23న తుది తీర్పు కూడా ఇవ్వబోతోంది. మరోవైపు తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని సీబీఐ కోర్టులోనే రఘురామకృష్ణంరాజు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ రెండు పిటిషన్లలో సీబీఐ కోర్టు ఇచ్చే ఆదేశాలు జగన్, సాయిరెడ్డి భవిష్యత్తును నిర్ణయంచబోతున్నాయి.

తెరపైకి రఘరామకొత్త ఫిర్యాదులు
ఓవైపు కోర్టుల్లో జగన్, సాయిరెడ్డిపై పిటిషన్లు వేసి ఇబ్బంది పెడుతున్న రఘురామకృష్ణంరాజు.. మరోవైపు ఇవే ఆరోపణలతో కేంద్రానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెయిల్ పై ఉన్న జగన్, విజయసాయిరెడ్డి.. ఇప్పటికీ ఆర్ధిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి.. దీన్ని హోంశాఖతో పాటు ఆర్ధికశాఖకూ పంపారు. వీటిని ఆయా శాఖలు ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో ఈ వ్యవహారం కూడా జగన్, సాయిరెడ్డికి ఇబ్బందికరంగా మారబోతోంది.

రఘురామపై సీబీఐకి ఫిర్యాదు
రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ కంపెనీ ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై సీబీఐ ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని ఆధారాలతో సహా సాయిరెడ్డి ఆమెకు అందించారు. దీంతో ఈ ఫిర్యాదు తమ పరిశీలనలో ఉందని నిర్మలా సీదారామన్ జవాబిచ్చారు. దీంతో రఘురామ కంపెనీలపై సీబీఐ కేసుల్ని తిరగతోడటం ద్వారా ఆయనకు కౌంటర్ ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ నిర్ణయాలపై ఉత్కంఠ
వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ల దగ్గరి నుంచి వారు ప్రస్తుతం ఆర్ధిక అక్రమాలు కొనసాగిస్తున్నట్లు రఘురామరాజు చేసిన ఫిర్యాదులు సీబీఐ, సీబీఐ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. అలాగే రఘురామరాజు సంస్ధలపై విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులు కూడా సీబీఐ వద్ద పెడింగ్ లో ఉన్నట్లే. ఇలా జగన్, సాయిరెడ్డి, రఘురామపై కేసులన్నీ సీబీఐ చేతుల్లోనే ఉండటంతో రాబోయే రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధ తీసుకునే ప్రతీ నిర్ణయం కీలకంగా మారబోతోంది. అదే సమయంలో వైఎస్ జగన్ కేంద్రం వద్ద గట్టిగా డిమాండ్లు వినిపించలేని పరిస్ధితులూ నెలకొంటున్నాయి.

కేంద్రం దయచూపితేనే
జగన్, సాయిరెడ్డి, రఘురామ ఇలా ముగ్గురూ చేసుకున్న ఫిర్యాదులపై సీబీఐ కానీ, కేంద్ర హోంశాఖ, ఆర్ధికశాఖలు కానీ, ప్రధాని కానీ సీరియస్ గా స్పందిస్తే మాత్రం వీరంతా చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేంద్రం దయాదాక్షిణ్యాలతో నెట్టుకొస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్... ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏదైనా తేడా వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అదే సమయంలో రఘురామరాజు కంపెనీలపైనా కేంద్రం ఇచ్చే ఆదేశాలతో సీబీఐ విరుచుకుపడితే ఆయనకూ కష్టాలు తప్పకపోవచ్చు. దీంతో కేంద్రం దయచూపితేనే ఈ ముగ్గురూ బయటపడేలా కనిపిస్తున్నారు.
Recommended Video

బీజేపీపై జగన్ పోరు వెనుక ?
మరోవైపు రాష్ట్రంలో తాజాగా మారిన పరిస్దితుల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని సీఎం జగన్ తన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీంతో వారు నిత్యం చెలరేగిపోతున్నారు. బీజేపీ మతతత్వంతో పాటు కేంద్రం చేస్తున్న అప్పుల్ని కూడా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్ సర్కార్ అప్పులపై బీజేపీ నేతలు కేంద్రం వద్ద ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. వీటిపై స్పందించి కేంద్రం లేఖలు కూడా పంపుతోంది. దీంతో ఏ క్షణాన ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే జగన్ బీజేపీపై సమరశంఖం పూరించారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై జగన్ మొదలుపెట్టిన పోరు తీవ్రత ఆధారంగానే కేంద్రం తదుపరి నిర్ణయాలు ఉన్నా ఆశ్చర్యం లేకపోవచ్చు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications