జగన్ దెబ్బకు స్పందించిన ప్రభుత్వం: బ్రాండెక్స్ సమస్య పరిష్కారానికి కమిటీ
అమరావతి: గత 20 రోజులుగా విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ బ్రాండెక్స్ కార్మికుల ఆందోళనతో అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. కనీస వేతనాలు, పీఎఫ్ బకాయిల విడుదల కోసం కంపెనీ కార్మికులు గత నెల 16 నుంచి బ్రాండెక్స్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
వేలాది మంది కార్మికులు విడతల వారీగా చేస్తున్న ఆందోళనలతో సెజ్ మొత్తం నిరసనలతో హోరెత్తుతోంది. ఆందోళనలు మొదలైన సందర్భంగా రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీలంకకు చెందిన సదరు కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు.
వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం మంత్రి అచ్చెన్నాయుడితో పాటు కార్మికులకూ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాట తప్పింది. ప్రభుత్వం సైతం ఆ హామీని నెరవేర్చేదిశగా ప్రయత్నాలు చేయలేదు. ఈ క్రమంలో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైసీపీ అధినేత వైయస్ జగన్ విశాఖకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ బ్రాండెక్స్ కార్మికుల చేపట్టిన ఉద్యమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలపనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా మిందిలోని పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇంటికి వెళ్లారు.
అక్కడ భోజనం అనంతరం బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అచ్యుతాపురం సెజ్‌కు చేరుకుంటారు. తొలుత బ్రాండెక్స్ కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీలో పాల్గొంటారు. వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడతారు.
అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 5.30 గంటలకు విమానంలో తిరిగి హైదరబాద్ పయనమవుతారు. ఇదిలా ఉంటే వైయస్ జగన్ బ్రాండెక్స్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు బయర్దేరారని తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై వేగంగా స్పందించింది.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖపట్నంలో కాలు మోపక ముందే బ్రాండెక్స్‌లో కనీస వేతనాల అమలు కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు అత్యవసరంగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications