అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!!

అమరావతి పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేసారు. పార్లమెంట్ లో అమరావతి ఏపీ రాజధాని గా చట్టబద్దత కల్పిస్తున్న వేళ జగన్ స్పందించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అని ఉందా అని ప్రశ్నించారు. రాజధాని పై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్ధసారధి చెప్పారని గుర్తు చేసారు. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ ను ప్రస్తావించారు. చట్టాలు గురించి మాట్లాడే వ్యక్తి... చట్ట సవరణ గురించి మాట్లాడారా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని వైసీపీ వ్యతిరేకిందచని జగన్ స్ఫష్టం చేసారు. అమరావతి చట్ట బద్దత పైన పార్లమెంట్ లో బిల్లు పెట్టే వేళ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజధానిలో ఏం చేసారని ప్రశ్నించారు. కేంద్రం సాక్షాత్తు రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసారని గుర్తు చేసారు. ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ లో కేంద్రం పాత్ర లేదని పేర్కొన్నారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం డిసైడ్ చేసిందా అని ప్రశ్నించారు.

ys-jagan-reacts-over-parliament-legislation-on-amaravati-as-andhra-pradesh-capital-made-key-commen

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెప్పారని.. సేకరిస్తున్న భారీ రుణాలు ఏం చేస్తున్నారని నిలదీసారు. భూములు ఇచ్చిన రైతుల హామీలు అమలు చేసారా అంటూ ప్రశ్నించారు. తొలుత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే రోడ్లు, కరెంట్, డ్రైనేజ్, వాటర్ వీటి కోసం అవసరం అయ్యే ఖర్చు చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు రూ 2 కోట్లు అవసరమని చెప్పారుబ50 వేల ఎకరాలకు లక్ష కోట్లకు దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలకు అదనం గా అయ్యే ఖర్చు మరో లక్ష కోట్లు అవుతుందని లెక్కలు చెప్పారు.

లక్ష ఎకరాల కోసం రూ 2 లక్షలు కావాలి.. ఎలా సాధ్యం

అమరావతికి ఈ నిధులు ఎక్కడ నుంచి వస్తాయి.. మాస్టర్ ప్లాన్ ఎందుకు మారుస్తున్నారని జగన్ ప్రనశ్నించారు. మున్సిపాల్టీగా మిలిగిపోతుందని ఎందుకు అంటున్నారని నిలదీసారు. అడుగు కోసం చేస్తున్న ఖర్చు 12 వేల వరకు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసలు అమరావతిలో చంద్రబాబు అండ్ టీం ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతి పై తీర్మానం గురించి మండలి లో ఎందుకు చర్చ చేయలేదని జగన్ నిలదీసారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ తేల్చి చెప్పారు. అయితే.. అన్ని విషయాలు ఓపెన్ గా చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. మౌలిక వసతుల కల్పన.. ఖర్చు గురించి ఆలోచన చేయాలని సూచించారు.

లక్ష ఎకరాలు సమీకరిస్తూ మౌలిక వసతుల కోసం 12 ఏళ్ల క్రితం వేసిన అంచనా మేరకరు రూ 2 లక్షల కోట్లు కావాలి.. ఇప్పుడున్న అంచనాలు పెరుగుతాయి. ఎక్కడ నుంచి తీసుకొస్తారో ఈ నిధులు అనేది సమస్య. ఇప్పటి వరకు ఎంత పెట్టారు.. రైతులకు ఇచ్చిన హామీలు ఏం చేసారనేది లెక్కలు వివరించారు. 2014-19 వరకు చంద్రబాబు అమరావతి పై రూ 5,335 కోట్లు ఖర్చు చేసారని చెప్పారు. అప్పు చేసి ఖర్చు చేసారన్నారు. 2024 నుంచి ఈ రెండేళ్ల కాలంలో అమరావతి కోసం రూ 47 వేల కోట్లు అప్పు చేసి.. అందులో రూ 13 వేల కోట్లు డ్రా చేసారని చెప్పుకొచ్చారు. ఇందులో మొబలైజేషన్ అడ్వాన్సుల కింద భారీగా నిధులు ఇచ్చారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+