వల్లభనేని వంశీ కోసం జగన్ వస్తున్నాడని..

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తీసుకుంటోన్న నిర్ణయాలు, చర్యలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో జోష్ నింపుతోంది. క్యాడర్ మొత్తం ఫుల్ యాక్టివ్ అయింది.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సొంతంగా ఎలాంటి బలం లేకపోయినప్పటికీ వాటిని సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సాగిస్తోన్న ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీకి అదనపు అస్త్రాలను అందించినట్టయింది. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానం, ఆ తరువాత పాలకొండ, తుని, పిడుగురాళ్ల.. వంటి స్థానిక సంస్థలను దక్కించుకోవడానికి టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపిస్తోంది వైసీపీ.

YS Jagan Reddy to meet Vallabhaneni Vamsi in Vijayawada Sub Jail

ఇప్పటికే ఒక్క పింఛన్లు మినహా మిగిలిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడం, వాటిని అప్పుడు ఇప్పుడూ వాయిదాలు వేస్తూ వస్తోండటం, దాదాపుగా అటకెక్కించిన వ్యవహారం పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందనేది బహిరంగ రహస్యం. స్వయంగా చంద్రబాబు అన్నమయ్య రాయచోటి జిల్లా సంబేపల్లి బహిరంగ సభలో దీన్ని చవి చూశారు కూడా.

ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందని, తమ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందంటూ భగ్గమంటోంది.

ఈ క్రమంలో విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే ఆయన జైలు వద్దకు చేరుకున్నారు. ములాఖత్ అయ్యారు. జగన్ రానున్నందున పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సబ్ జైలుకు తరలివస్తోన్నారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ సహా విజయవాడ సిటీ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకులు సబ్ జైలుకు చేరుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున విజయవాడ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సబ్ జైలు పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు. జైలుకు దారి తీసే మార్గాల్లో బ్యారికేడ్లను అమర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+