YS Jagan Bandage: వైఎస్ జగన్ తలకు బ్యాండేజ్ తొలగింపు..!
ఏపీలో సీఎం జగన్ పై విజయవాడలో రాయిదాడి జరిగి రెండు వారాలవుతోంది. రాయి దాడి జరగగానే ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆయన తలకు బ్యాండేజ్ కట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ బ్యాండేజ్ తోనే ఆయన మేమంతా సిద్ధం రోడ్ షోలు, సభల్లోనూ పాల్గొన్నారు. దెబ్బ తగిలి రెండు వారాలవుతున్నా ఈ బ్యాండేజ్ కొనసాగింపుపై విపక్షాలు సెటైర్లు వేస్తూ వచ్చాయి. అయితే ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపిస్తున్నారు.
సీఎం జగన్ కు రాయి దాడి గాయం కాగానే బ్యాండేజ్ వేసిన డాక్టర్లు ఆ తర్వాత దాన్ని తీయకుండా అలాగే కొనసాగించారు. దీంతో ఓ దశలో జగన్ సోదరి డాక్టర్ సునీతారెడ్డి సైతం ఆ బ్యాండేజ్ తీసేయాలని సూచించారు. ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అవుతుందని గుర్తుచేశారు. దీనిపైనా జగన్ వెంటనే స్పందించలేదు. కానీ ఇవాళ ఏమనుకున్నారో ఏమో కానీ బ్యాండేజ్ తీసేసి దర్శనమిచ్చారు.

ఈ మధ్యలో విపక్షాలు రాయిదాడితో పాటు బ్యాండేజ్ పైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగించాయి. దీనికి వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి చేసిన సూచనపైనా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ కు బ్యాండేజ్ ఎప్పుడు తీయాలో తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా జగన్ బ్యాండేజ్ ఎన్నికల వేళ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications