సుప్రీం తీర్పునూ వక్రీకరిస్తారా ? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చంద్రబాబు వేసిన సిట్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే.. ఆయన మాత్రం దాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తీ లేకుండా తప్పులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలను టీడీపీ వక్రీకరిస్తోందని జగన్ విమర్శించారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆక్షేపించారు.

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి అంటూ టీడీపీ ఎక్స్ హ్యాండిల్ లో చంద్రబాబు ట్వీట్ పెట్టడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబు మీద అక్షింతలు వేశారని నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసిందని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు తప్పుల్ని నేషనల్ మీడియా వేలెత్తి చూపిస్తున్నా, సుప్రీంకోర్టు తిడుతున్నా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం ఎంత దుష్ప్రచారం చేస్తోందో చూడాలని జగన్ కోరారు.
చంద్రబాబు మాటలు అబద్ధమని టీటీడీ ఈవో పదే పదే చెప్తున్నారని, అయినా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఇంత జరిగినా తిరుమల అన్నా తిరుపతి అన్నా నాకు భయమూ లేదూ భక్తీ లేదనే విధంగా చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో మన గుడిని, మన లడ్డూ ప్రసాదాన్ని మనమే తగ్గించుకుంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని జగన్ ఆక్షేపించారు.
లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయనకు మొట్టికాయలు వేయాలని కోర్టుల్ని, ప్రధాని మోడీని తాము ఆశ్రయించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. సెప్టెంబర్ 25న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని చెప్పిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. 26 సెప్టెంబర్ న ఎఫ్ఐఆర్ నమోదు అయితే 18నే చంద్రబాబు బహిరంగ ఆరోపణలు చేయడం భక్తుల సెంటిమెంట్ దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందని జగన్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications