తప్పు చేయలేదు: జగన్, కెరీర్ పక్కబెట్టి: పవన్‌పై బాబు
కడప/నెల్లూరు: తాను ఏ తప్పు చేయలేదని, తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన కృష్ణా జిల్లా తిరువూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కాగానే సీమాంధ్ర దశ, దిశను మార్చే ఐదు ఫైళ్ల పైన సంతకాలు చేస్తానని చెప్పారు.
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారన్నారు. ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఉండరని, టిడిపి కూడా ఉండదని చెప్పారు.

ఓట్ల కోసం తప్పుడు కేసులతో తనను జైలుకు పంపించారని చెప్పారు. రాజకీయాల్లో విలువలు పూర్తిగా దిగజారాయని చెప్పారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. 25 లోకసభ స్థానాలను గెలుచుకొని ప్రధాని అభ్యర్థిని మనమే నిర్ణయిద్దామని చెప్పారు.
కెరీర్‌ను పక్కన బెట్టారు: పవన్ పైన బాబు
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌ను పక్కన బెట్టి మరీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎంతో ఆవేదనతో ముందుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కాంక్షించి ఇలా వచ్చే వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. ప్రతిఫలం ఆశించకుండా బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థులను బలపర్చిన పవన్‌కు థ్యాంక్స్ అని చెప్పారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఆదరిస్తున్నారు: పురంధేశ్వరి
రాయలసీమ ప్రజలు తనను ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ లోకసభ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు సాధిస్తామని ఆమె చెప్పారు. అంతేకాక మైనార్టీల అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications