Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు కేసుల కొట్టివేతపై జగన్ షాకింగ్ కామెంట్స్..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలన పైన మండి పడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసారని ధ్వజమెత్తారు. కేసుల్లో బెయిల్‌పై ఉన్న వ్యక్తి అధికారులను బెదిరించి కేసులు కొట్ట కొట్టేయించుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ పరకామణి కేసు పైనా జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రైతులను చంద్రబాబు వదిలేసారని విమర్శించారు. సంక్షేమం అమలు కావటం లేదన్నారు. తమ పార్టీ నేతల పైన కక్ష్య పూరితంగా కేసులు నమోదు చేసి వేధిస్తు న్నారని జగన్ మండిపడ్డారు.

టీటీడీ పరకామణి కేసుపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు. ప్రాయశ్చిత్తంగా రూ.14కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని వ్యాఖ్యానించారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని, తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ వేశారని గుర్తుచేశారు. మెగా లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించారని తెలిపారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక.. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఇదంతా తిరగదోడుతున్నారని తెలిపారు. పరకామణి దొంగ.. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేశారని చెప్పుకొచ్చారు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని అన్నారు. తిరుమల హుండీ లెక్కింపును తమ ప్రభుత్వంలో పారదర్శకం చేశామని జగన్ వివరించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. కేసుల్లో బెయిల్‌పై ఉన్న వ్యక్తి అధికారులను బెదిరించి కేసులు కొట్ట కొట్టేయించు కుంటున్నారని జగన్ విమర్శించారు. అబద్దపు వాంగ్మూలాలు ఇప్పించారని మండిపడ్డారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.

ys-jagan-sensational-allegations-against-cm-chandra-babu-over-his-cases

చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగిందని గుర్తు చేశారు చంద్రబాబు సెప్టెంబర్‌ 1న ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. రమణ, సురేష్ ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని తెలిపారు. అలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఇద్దర్నీ జైల్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. విచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతిను ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి, అశోక్‌ గజపతికు చెరో న్యాయమా అని ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని జగన్ అన్నారు. కల్తీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని తెలిపారు. రాష్ట్రమంతటా కల్తీ మద్యం దందా నడుపుతున్నది టీడీపీ నేతలేనని అన్నారు. కేసులు మాత్రం వైసీపీ నేతలపై పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గం సంతోషంగా లేర‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్రబాబు 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో 17 సార్లు ప్రకృతి వైఫరిత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారని చెప్పారు. రైతులకు ఏకంగా 17 సార్లు గవర్నమెంట్‌ నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ రావాల్సి ఉంది. దాదాపుగా రూ.1100 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలు ఉన్నాయని వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్, విద్యా దీవెన బకాయిలు అందలేదని మండి పడ్డారు. ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసారని జగన్ విమర్శించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+