Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంపేదీ ఆయనే-మొసలి కన్నీరూ ఆయనే-చంద్రబాబుపై జగన్ ఫైర్-అయినా పవన్, మీడియా..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తాజాగా పెంచిన పెన్షన్ కానుకను సీఎం జగన్ ఇవాళ రాజమహేంద్రవరంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ దారులతో ముఖాముఖీ మాట్లాడారు. ఆ తర్వాత ప్రసంగించిన సీఎం జగన్.. తాజాగా చోటు చేసుకున్న కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్ని ప్రస్తావించారు. చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే దత్తపుత్రుడు పవన్ కానీ, ఎల్లో మీడియా కానీ ప్రశ్నించకుండా సహకరిస్తున్నాయని జగన్ మండిపడ్డారు.

పెన్షన్లపై మరో ముందడుగు

పెన్షన్లపై మరో ముందడుగు

ఏపీలో పెన్షన్ రూ.2750కు పెంపుతో మరో ముందడుగు వేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. సామాజిక పెన్షన్లలో వృద్ధులతో పాటు వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లు పెంచుతున్నట్లు జగన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ సొమ్ము రూ.2750 నుంచి ఏకంగా 10వేల రూపాయల వరకూ ఇస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ రాష్ట్రమేనని జగన్ తెలిపారు. పెన్షన్ పెంపుతో పాటు గత జూలైతో పాటు నవంబర్ వరకూ అర్హులైన వారికి కొత్త కార్డులు కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ అప్పటి ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య కూడా 39 లక్షలేనన్నారు. కానీ ఇవాళ వైసీపీ ప్రభుత్వం 64 లక్షలన్నారు. అదీ ఎలాంటి కత్తిరింపులు లేకుండా ఇస్తున్నామన్నారు. పెన్షన్లకు కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటున్నామన్నారు.

చంద్రబాబుపై జగన్ కామెంట్స్

చంద్రబాబుపై జగన్ కామెంట్స్

ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్న చంద్రబాబు మళ్లీ ఆయన ఫొటోకు దండలేస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంపేది ఆయనే, మళ్లీ మొసలి కన్నీళ్లు కార్చేది ఆయనేనన్నారు. వెన్నుపోటు ఆయన నైజం, ఫొటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీళ్లు కార్చడం ఆయన నైజమన్నారు. కందుకూరులో 8 మందిని చంపేసి, మళ్లీ గుంటూరులో చీరల పంపిణీ పేరుతో సభ పెట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు వచ్చే దాకా, మీటింగ్ పూర్తయ్యే దాకా చీరల్ని పంచలేదు, జనం వెళ్లిపోతారనే అలా చేశారన్నారు. చంద్రబాబు వెళ్లిపోయాక , అరకొర చీరలు ఉన్నాయి, టోకెన్లు వేలల్లో ఉన్నాయన్నారు. అందుకే తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు బలయ్యారన్నారు. తాను బలి తీసుకుంటాడు, మొసలి కన్నీరు కారుస్తాడు, పోలీసులది తప్పంటాడని చంద్రబాబును విమర్శించారు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ఎక్కడైనా ఉంటాడా అని ప్రశ్నించారు.

ఎల్లో మీడియా, పవన్ పైనా..

ఎల్లో మీడియా, పవన్ పైనా..


కందుకూరు ఘటన తర్వాత చంద్రబాబు మౌనం పాటించాలంటారని, ఆస్పత్రికి వెళతారని, మళ్లీ షూటింగ్ కు వెళ్లిపోతారని జగన్ విమర్శించారు. చంద్రబాబు మనుషుల్ని చంపేసి తానే మహోన్నతవాదిలా డ్రామాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా.. ఈనాడు రాయదని, ఆంధ్రజ్యోతి చూపదని, టీవీ 5 అడగదని, దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడని జగన్ విమర్శలు గుప్పించారు. ఎందుకంటే వీరంతా గజ దొంగల ముఠా అని జగన్ ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబు దోచుకో, పంచుకో తినుకో పథకం అమలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఆయన్ను అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియాతో పాటు దత్తపుత్రుడు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ మీ బిడ్డకు వీరందరి అండ లేకపోయినా ఆ దేవుడి దయ ఉందన్నారు.

ఓ ఎస్సీ, బీసీ, మైనార్టీని నమ్ముకున్నా..

ఓ ఎస్సీ, బీసీ, మైనార్టీని నమ్ముకున్నా..

ఇవాళ రాష్ట్రంలో కులాల యుద్ధం జరగడం లేదని, క్లాస్ యుద్ధం జరుగుతోందని జగన్ తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందార్లకు వ్యతిరేకంగా మీ బిడ్డ పోరాడుతున్నాడని, కాబట్టి తనకు ఆశీస్సులు ఇవ్వాలన్నారు. మీ కోసం ఇంగ్లీష్ మీడియా తేవాలన్నా, మరో కార్యక్రమం చేపట్టాలన్నా అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. తనకు చంద్రబాబులా ఎల్లో మీడియా, దత్తపుత్రుడి సాయం లేదని, తాను కేవలం ఓ ఎస్సీని, బీసీని, మైనార్టీని నమ్ముకున్నానన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+