బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి: పార్టీ సీనియర్లతో అధినేత జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ కూడా పార్టీని విజయవాడలో ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలకు విజయవాడలో అనువైన ఆఫీసుని చూడాలంటూ సూచినట్లుగా తెలుస్తోంది.

విభజన తర్వాత ఏపీకి చెందిన రాజకీయ పార్టీలన్నీ కూడా విజయవాడ, గుంటూరు పట్టణాల్లో తమ తమ పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ఆఫీసుని ఏపీ టీడీపీ శాఖకు ఆఫీసుగా మార్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 'బెజవాడ వెళ్లిపోదాం... ఆఫీసు చూడండి' అని పార్టీ సీనియర్లకు వైసీపీ అధినేత వైయస్ జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. గురువారం సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ సూచనతో ఆగస్టు 3 తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని చూసేందుకు నేతలు సిద్ధమయ్యారు.

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం రాజకీయ పార్టీలకు భూమి కేటాయించే విధానాలను ఏపీ ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో ఆయా పార్టీల బలం ఆధారంగా కేటాయించే ఈ స్థలాలను 33 ఏళ్ల పాటు లీజుకిస్తారు.

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

ఆ తర్వాత దానిని 99 ఏళ్లకు పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. లీజు భూమికి ఆయా పార్టీలు ఎకరానికి సంవత్సరానికి రూ.1,000 చెల్లించాలి. కేటాయించిన ఏడాదిలోగా కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కేటాయింపు రద్దు చేస్తామని ప్రకటనలో పేర్కొంది.

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 50 శాతానికిపైగా ఉన్న పార్టీలకు 4 ఎకరాలు.. 25 నుంచి 50 శాతం లోపు ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయిస్తారు. 25శాతం లోపు, లేదా మండలి, అసెంబ్లీలో కలిపి కనీసం ఒక్క సభ్యుడైనా ఉన్న పార్టీలకు 1000 గజాలు కేటాయిస్తారు.

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి

ఇక జిల్లా కేంద్రాల్లో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 50 శాతానికిపైగా ఉన్న పార్టీలకు 2 ఎకరాలు.. 25 నుంచి 50శాతం పార్టీలకు 1000 గజాలు కేటాయిస్తారు. 25శాతం లోపు, మండలి, అసెంబ్లీలో కలిపి కనీసం ఒక్క సభ్యుడైనా ఉన్న పార్టీలకు 300 చదరపు గజాలు కేటాయిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ys jagan shifting party office to Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి