ద్రోహులనవద్దు: జగన్‌కు టిజి వెంకటేష్ సలహా

హైదరాబాద్: సమైక్యవాదులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ద్రోహులని అనవద్దని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ సలహా ఇచ్చారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సిపిఐ కార్యదర్శి కె. నారాయణ సమైక్యాంధ్ర కోసం లేఖలు ఇవ్వాలని ఆయన కోరారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీ అధ్యక్షులే వెళ్లాలని ఆయన అన్నారు.

సమన్యాయమని ఎవరు అన్నా విభజనకు అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. జగన్ మార్కులు పెంచుకోవాలని చూస్తే ప్రజలకు న్యాయం జరగదని ఆయన అన్నారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం విభజనకు అనుకూలంగా వ్యహరించకుండా ప్రజాభిప్రాయం మేరకు సమైక్యాంధ్రకు కట్టుబడాలని తాను నారాయణకు సూచించినట్లు ఆయన తెలిపారు. విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి కూడా చెప్పాలని తాను సూచించినట్లు చెప్పారు. సిపిఎం ఏదైనా కొరడా తీసుకోండని తొలుత గోడ మీది పిల్లిలా వ్యవహరించిందని, ఇప్పుడు సమైక్యవాదానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలన ఆయన అన్నారు.

TG Venkatesh

మేం వెళ్లం: శైలజానాథ్

అఖిల పక్ష సమావేశాన్ని తాము అంగీకరించబోమని రాయలసీమకు చెందిన రాష్టర్ మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజనపై పునరాలోచన చేస్తామంటేనే అఖిల పక్ష సమావేశానికి వెళ్తామని, విభజన కోసమైతే తాము వెళ్లబోమని ఆయన చెప్పారు. తామైతే అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని, పార్టీ ఎవరిని పంపుతుందో తెలియదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీలనే కాదు, ఉద్యోగ సంఘాలను, విద్యార్థి సంఘాలను కూడా పిలువాలని కోస్తాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

మొట్టికాయలతోనే: పయ్యావుల

రాష్ట్రపతి మొట్టికాయలతోనే కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం పెడుతోందని భావిస్తున్నట్లు తెలుగుదేశం రాయలసీమ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అఖిల పక్ష సమావేశం ఎజెండా ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమస్య అఖిల పక్ష సమావేశంలో పరిష్కారం కాదని, విభజనపై శానససభలో విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అన్నారు.

తాత్సారానికైతే వ్యతిరేకిస్తాం: హరీష్

తెలంగాణ రాష్టర్ ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేయడానికి అఖిల పక్ష సమావేశమైతే తాము వ్యతిరేకిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత అఖిల పక్ష సమావేశం ఎందుకని ఆయన అడిగారు. అఖిల పక్ష సమావేశంలో చర్చించేదేమీ ఉండదని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడానికైతే ఫరవా లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+