ఉద్యోగుల హామీల అమలేదీ ? మ్యానిఫెస్టో ముందుపెట్టి జగన్ ప్రశ్నలు..!

ఏపీలో ఉద్యోగులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది అంటూ జగన్ ప్రశ్నించారు.

కేబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం అలవాటుగా మారిందని జగన్ విమర్శించరు. కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరంమీద తప్ప, ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద కాదన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తులమీద మీకున్నది కపట ప్రేమేనన్నారు. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే అన్నారు. బాధలు భరించలేక వారంతా రోడ్డుమీదకు వస్తున్నారన్నారు.

YS Jagan Slams Chandrababu Over Broken Pledges and Unpaid Dues

చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని, ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడాలని జగన్ కోరారు. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారని, మరి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారని, ఆ సంగతి ఏమైందని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించామని, అంతేకాకుండా పీఆర్సీ వేసి, దానికి ఛైర్మన్‌ను కూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా పీఆర్సీ ఛైర్మన్‌ని వెళ్లగొట్టారన్నారు. ఆతర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారన్నారు.

ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్‌ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్‌ అని, దసరా పండుగకు అవి క్లియర్‌ అవుతాయని ఉద్యోగులు ఎంతో ఎదురుచూశారని గుర్తుచేశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోందని, కాని ఇచ్చే ఆలోచన ఉన్నట్లు అనిపించడం లేదన్నారు. సీపీఎస్, జీపీఎస్ లు పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా అని అడిగారు.

ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్ మెంట్‌ లీవులు... వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదన్నారు.

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదన్నారు. వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారన్నారు. విలేజ్‌ క్లినిక్కులూ, పీహెచ్‌సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారని, జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారన్నారు.

YS Jagan Slams Chandrababu Over Broken Pledges and Unpaid Dues

ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్‌ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశామని, దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్‌ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారన్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుందన్నారు. తాము అధికారంలోకి రాగనే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలు పెంచామని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయని, హెల్త్‌ కార్డులున్నా ప్రయోజనం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+