అవినీతి+నిర్లక్ష్యం=గోడ కూలింది? సింహాచలం ఘటనపై జగన్ సంచలన ఆరోపణలు

విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చోటుచేసుకున్న ఘోర విషాదం రాష్ట్రంలో కలకలం రేపింది. అప్పన్నస్వామి చందనోత్సవ పర్వదినాన, స్వామి వారి నిజరూప దర్శనం కోసం రూ.300 టికెట్‌తో క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులపై ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో దంపతులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

ఈ ఘోర దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తక్షణమే తాడేపల్లి నుంచి విశాఖ చేరుకున్నారు. చంద్రంపాలెంలో మృతి చెందిన ఉమామహేష్, శైలజ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించి, శోకసంద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ys-jagan-slams-government-over-simhachalam-temple-tragedy

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌, రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "తెలిసి కూడా ఎందుకంత నిర్లక్ష్యం?" అని ప్రశ్నించారు. చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీశారు. భక్తుల భద్రతకు సరైన ఏర్పాట్లు చేయకుండా, నిర్లక్ష్యంతో ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు.

గతంలో తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటను ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు కుప్పం పర్యటనకు పంపి, భక్తులను ఒకేసారి వదిలి తొక్కిసలాటకు కారణమయ్యారని, అక్కడ ఆరుగురి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇప్పుడు సింహాచలంలో కూడా ఇదే నిర్లక్ష్యం కొనసాగిందని విమర్శించారు. ఆలయ ప్రాంగణంలో కనీసం తాత్కాలిక టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్ఘటనకు కారణమైన గోడ నిర్మాణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఇది పచ్చి అవినీతికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. కేవలం ఆరు రోజుల క్రితం పనులు మొదలుపెట్టి, నాలుగు రోజుల్లోనే 20 మీటర్ల పొడవు, 10 అడుగుల ఎత్తు ఉన్న గోడను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. కనీసం కాలమ్స్‌ లేకుండా, నాసిరకం ఫ్లైయాష్‌ ఇటుకలతో కట్టిన గోడ ఎలా నిలబడుతుందని, రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్‌తో కట్టాల్సిన దానిని టెండర్లు లేకుండా ఎలా అప్పగించారని నిలదీశారు. రెండు రోజుల క్రితమే నిర్మాణం పూర్తైన కొత్త గోడ పక్కనే వందలాది మంది భక్తులను ఎలా నిలబెట్టారని, భద్రత గురించి ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదని మండిపడ్డారు.

గత 11 నెలల చంద్రబాబు పాలనలో తిరుపతి తొక్కిసలాట, శ్రీకూర్మం గుడిలో తాబేళ్ల మృతి, టీటీడీ గోశాలలో గోవుల మృతి, కడప కాశినాయన ఆశ్రమం కూల్చివేత వంటి వరుస దుర్ఘటనలు ప్రభుత్వ వ్యవస్థలపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని జగన్‌ వ్యాఖ్యానించారు. భక్తుల ప్రాణాల పట్ల ఇంతటి నిర్లక్ష్యం తగదని, జరిగిన దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+