జగన్ ఇంకా భయపెడుతున్నారా? చంద్రబాబు కామెంట్స్ పై చర్చ..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 175 సీట్లకు 164 సీట్లలో గెలిచి దుర్బేద్యంగా మారింది. అటు వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అధికార పక్షం కాదు కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ మధ్య జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు తరచుగా చేస్తున్న ఓ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో జగన్ తిరిగి వస్తే మా పరిస్ధితి ఏంటి ?- సీఎం చంద్రబాబు తరచూ ఈ ప్రశ్న ఎదుర్కొంటున్నారట. ఈ మధ్యే చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. అయితే డెవిల్ ను మళ్లీ రానివ్వకుండా నియంత్రిస్తానంటూ అందరికీ చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అయితే దీనికి కొనసాగింపుగా ఏపీని ఓ సైకో భూతం (జగన్ ) పట్టుకుని వేలాడుతోందంటూ తాజాగా మరోసారి చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టూర్ లో భాగంగా ఎన్డీఆర్ భవన్ లో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోందని, పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తనదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ అధికారం కోల్పోయి విపక్ష హోదా కూడా లేకుండా పోయినా ఇంకా చంద్రబాబును, టీడీపీని భయపెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.
ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..
— Telugu Desam Party (@JaiTDP) July 7, 2024
ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా.#NaraChandraBabuNaidu#TDP#Telangana pic.twitter.com/nEd7enhDOs
జగన్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అన్న భయం పారిశ్రామిక వేత్తలకు ఉందా లేక అధికార కూటమికి ఉందా చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ప్రజలు బంపర్ మెజార్టీతో ఇచ్చిన అధికారం సాయంతో ప్రజల్లో అయినా, పారిశ్రామిక వేత్తల్లో అయినా భరోసా నింపాల్సిన బాధ్యత మాత్రం సీఎంగా చంద్రబాబుకే ఉంది.












Click it and Unblock the Notifications