'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే!: అందులో చంద్రబాబే విలనట!

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించింది. యాత్ర ఆరంభం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైయస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ యాత్రలో ఆరోపణలు, ప్రత్యారోపణలకు రాష్ట్రం మొత్తం ఆందోళన కార్యక్రమాలతో మారుమ్రోగింది.

ఐదు రోజుల పాటు అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాన్‌స్టాప్‌గా సాగిన ఈ భరోసా యాత్ర ఆదివారం సాయంత్రం ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపలల్లెలో ముగిసింది. అనంతరం డబురువారిపల్లి, కొండకమర్ల, నల్లమాడ, నల్లశింగయ్యగారిపల్లి, మలకవేమల క్రాస్‌ మీదుగా భరోసా యాత్ర ముదిగుబ్బ మీదుగా జగన్‌ అనంతపురం చేరారు.

సాయంత్రం అక్కడి అంబేద్కర్‌ కూడలిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ఓ సినిమా స్టోరీని చెప్పారు. ఈ సినిమా స్టోరీలో తనను తాను హీరోగా అభివర్ణించుకున్న జగన్, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును మాత్రం విలన్‌గా పేర్కొన్నారు.

ఇరువురి పాత్రలను సినిమా స్టోరీలో పరోక్షంగా పేర్కొన్నారు. జగన్ చెప్పిన ఈ సినిమా స్టోరీకి వైసీపీ కార్యకర్తల నుంచి మంచి స్పందనే వచ్చింది. ''చంద్రబాబు లాంటి వ్యక్తిని చూస్తే సినిమాల్లో విలన్ పాత్ర గుర్తుకొస్తోంది. సినిమాల్లో 14 రీళ్లు ఉంటే 13 రీళ్లదాకా విలన్‌దే ఆధిపత్యం. హీరో అమాయకుడు. చంద్రబాబుకు తెలిసినంత స్థాయిలో ఆ హీరోకు అవినీతి తెలియదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేడు. అబద్ధాలు చెప్పలేడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. సినిమా ల్లో 14వ రీల్ వచ్చేసరికి కథ క్లైమాక్స్‌కు వస్తుంది. కథ అడ్డం తిరుగుతుంది. విలన్ జైలుకు వెళ్తాడు. హీరో రాజవుతాడు. ప్రతి సినిమాలోనూ ఇదే జరుగుతుంది.'' అని జగన్ సినిమాను ఆసక్తికరంగా చెప్పారు.

 'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే


ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నయవంచనకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఆయన చేస్తున్న మోసాలపై ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు.

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే


అంతేకాదు అనంతపురం జిల్లా మనవడినని జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నెలరోజుల పాటు భరోసా యాత్ర చేశానని చెప్పారు. ప్రతి గడపా తొక్కానని, ప్రతి కుటుంబానికీ ఆసరా ఇచ్చానని చెప్పుకొచ్చారు.

 'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే

నాకు చేతనైన మేర సాయం చేశానని చెప్పిన జగన్ నియోజకవర్గం దాటిన తర్వాత ఏదైనా ఘటన జరిగి ఉంటే వారందరికీ గట్టిగా భరోసా ఇస్తానని అన్నారు.

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే

'అనంత'లో జగన్ చెప్పిన సినిమా స్టోరీ ఇదే


అనంతపురం జిల్లా ప్రజలు చూపిన ఆదరణనను తన జీవితంలో మరువలేనని చెప్పుకొచ్చిన వైయస్ జగన్, తాను ఈ జిల్లా మనవడిననే విషయం మరవొద్దని ప్రజలతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+