మజ్జి శ్రీనుకి జగన్ రిటర్న్ గిఫ్ట్ - పొటిలికల్ 'లాక్'.. సీన్ రివర్స్..!!
మజ్జి శ్రీను వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది. టీడీపీలో తన కుమార్తెతో సహా చేరిన మజ్జి శ్రీను అధికార కూటమి నేతలతో సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లి కలిసి వచ్చిన ఆయన.. ఇప్పుడు వైసీపీలోని తన బంధుత్వం కలిగిన నేతలు.. మద్దతు దారులను టీడీపీ వైపు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు మజ్జి శ్రీను అండ్ కో ను ఇరకాటంలోకి నెట్టాయి. దీంతో.. తదుపరి పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
మజ్జి శ్రీను టీడీపీలో చేరటంతో విజయనగరంలో వైసీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. చిన్న శ్రీను తన కుమార్తె తో సహా టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే వైసీపీ నుంచి మరి కొందరు నేతలు.. మద్దతు దారులు టీడీపీలోకి వస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. చిన్న శ్రీను పార్టీ వీడగానే వైసీపీ అప్రమత్తం అయింది. కన్నబాబు, కేకే రాజు మాజీ సీఎం జగన్ కు నివేదికలు సమర్పించారు.

వెంటనే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ ను నియమిస్తూ... అదే సమయంలో ఇక చిన్న శ్రీను వియ్యంకుడు అయిన నెల్లిమర్ల వైసీపీ ఇంచార్జి బడ్డుకొండ అప్పలనాయుడుని ఆ బాధ్యతల నుంచి అధినాయకత్వం తప్పించి ఆయన ప్లేస్ లో ఒక జెడ్పీటీసీ గా ఉన్న సన్యాసినాయుడు ను నియమించారు. అప్పలనాయుడు వైసీపీ వీడి టీడీపీలోకి వెళ్తారనే సమాచారంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. అప్పల నాయుడు మాత్రం తాను పార్టీ మారటం లేదని సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ కీలక నిర్ణయాలతో
బొత్సా సైతం ఈ వ్యవహారంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అటు అప్పలనాయుడు టీడీపీలోకి రావటం పైన కూటమి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లిమర్లలో టీడీపీ ఇంచార్జ్ గా సీనియర్ నేత కర్రోతు బంగారు రాజు ఉన్నారు. అలాగే జనసేన తరఫున ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. ఈ కారణాలతో ఆయన టీడీపీలోకి వెళ్లినా ప్రయోజనం ఉండదనే చర్చ ఉంది. అయితే.. ఈ లెక్కలు పరిగణలోకి తీసుకొనే.. ముందస్తుగానే జగన్ నెల్లిమర్లలో అప్పలనాయుడును లాక్ చేసినట్లు పార్టీ నేతల విశ్లేషణ.
అదే విధంగా పార్టీలోని మజ్జి శ్రీను మద్దతు దారులతో బొత్సా మంత్రాంగం కొనసాగు తోంది. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం జరగకుండా చర్చలు చేస్తున్నారు. కాగా.. అటు కూటమి నుంచి మజ్జి శ్రీను..ఆయన కుమార్తెకు మద్దతు ఉండదని పార్టీ నేతల నమ్మకం. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు లేకుండా చేయటయే జగన్ లక్ష్యంగా స్పష్టం అవుతోంది. దీంతో.. తాజా పరిణామాల వేళ రానున్న రోజుల్లో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
