గణపయ్యకు బంగారు మోదకాలు.. కిలో రూ.27 వేలు, అయినా తగ్గని భక్తులు!
వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి అంటేనే దేశ వ్యాప్తంగా ఎన్నో స్పెషల్స్ దర్శనం ఇస్తాయి. ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాలు మాత్రమే కాదు, వంటలు, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలలో కూడా స్పెషల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలో బంగారు మోదకాలు అందరినీ రుచి చూడమంటున్నాయి.
మహారాష్ట్రలోని నాసిక్‌లో కూడా గణేశ నవరాత్రి వేడుకలలో బంగారు మోదకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విద్యా వికాస్ సర్కిల్‌లోని సాగర్ స్వీట్స్‌లో 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో తయారు చేసిన గోల్డెన్ మోదకాలు అమ్ముతున్నారు. ఒక్క కిలో ధర రూ.27,000గా నిర్ణయించారు. సహజంగా గణేశుడికి ఇష్టమైన మోదకాలు సాధారణంగా 400 రూపాయల నుండి 1200 రూపాయల వరకు ఉంటుంది.

కానీ వినాయక చవితి స్పెషల్ మోదకాలు ఒక్క పీస్ ఈ ఏడాది 540 రూపాయలు ధర పలుకుతుంది. సాధారణ మోదకాల కంటే ధర ఎక్కువైనా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఉండాలనుకునే వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు అయినా వెనక్కు తగ్గకుండా వీటిని కొనుగోలు చేస్తున్నారు.
2021లో రూ.12 వేలుగా ఉన్న మోదకాల ధర, గతేడాది కిలో రూ.20 వేలకు చేరుకుంది. అది ఇప్పుడు మరింత పెరిగింది. ఈ సారి ధర భారీగా పెరిగింది. మరోవైపు తినదగిన వెండి పూతతో తయారు చేసిన 'సిల్వర్ మోదక్'లను కూడా షాపు అందుబాటులోకి తెచ్చింది.ఇక్కడ కాజు, డ్రైఫ్రూట్, ఆరెంజ్, మలాయ్ తదితర 25కి పైగా రకాల మోదకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రత్యేక రుచులకు డిమాండ్ పెరుగుతుంది.
ఈ గోల్డెన్ మోదకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాసిక్‌లో బంగారు మోదకాలు వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఏది ఏమైనా వినాయక చవితి వేడుకలు కళాకారులలో సృజనకు మాత్రమే కాదు పాక శాస్త్రంలో కూడా ప్రావీణ్యం చూపించేందుకు అవకాశం కల్పిస్తుంది. వినాయకుడి పట్ల భక్తుల శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications
