నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాలకు దెయ్యాలొస్తాయి! భయపడొద్దు: బాబును ఏకేసిన జగన్

నంద్యాల ఉపఎన్నికల ప్రంచారంలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల ప్రంచారంలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో.. నంద్యాలను కూడా అలానే చేస్తానని జగన్ అన్నారు.

భయపడొద్దు..

భయపడొద్దు..

‘నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి.. నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకొదిలేయండి' అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నంద్యాలలోని సాయిబాబానగర్‌లో ఆయన పర్యటించారు. వైయస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
చంద్రబాబు ఘనకీర్తి అదే..

చంద్రబాబు ఘనకీర్తి అదే..

‘కిడ్నీ రోగుల డయాలసిస్‌ కోసం వెళితే.. సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు. 108కి ఫోన్‌చేస్తే డీజిల్‌ లేదనో, జీతాల కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారనో సమాధానం వస్తుంది. బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు.. ఇప్పుడేమో మద్యం హోండెలివరీ ఇస్తామంటున్నారు. ఇదీ.. మూడేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిన ఘనకీర్తి' అని వైయస్‌ జగన్‌ అన్నారు.

బాబుకు చెంపపెట్టు కావాలి..

బాబుకు చెంపపెట్టు కావాలి..

గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు గానీ, ఆయన మంత్రులుకానీ ఒక్కటంటే ఒక్కసారైనా నంద్యాలకు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేసరికి వాళ్లకు ప్రజలు గుర్తొచ్చారని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ‘నంద్యాలలో మీరు వేసే ఓటు.. చంద్రబాబు దుర్మార్గ పాలకు చెంపపెట్టులాంటిది. న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండి. నంద్యాల అభివృద్ధి విషయంలో ఎలాంటి భయాలొద్దు. ఆ బాధ్యత నాది' అని జగన్‌ హామీ ఇచ్చారు.

దెయ్యాలొస్తాయి..

దెయ్యాలొస్తాయి..

‘నంద్యాలకు దెయ్యాలు వస్తాయి.. ఒక్కో ఓటరు చేతిలో రూ.5వేల పెట్టి, ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మానికి ఓటేసి దెయ్యాలని పారద్రోలాలి' అని జగన్‌ అన్నారు. మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైయస్‌ జగన్‌ విమర్శించారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy take on at Andhra Pradesh CM chandrababu in Nandyal campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X