వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనుషులేనా, సిగ్గు తెచ్చుకోండి: బాబు, కిరణ్‌లపై జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రుల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. వీళ్లు మనుషులేనా అంటూ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ విలేకరులతో మాట్లాడారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చి విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం పాస్ చేయాలని డిమాండ్ చేశారు.

తాము ఇదే డిమాండును గతంలోను వినిపించిన తమ వేదన అరణ్య రోదనేగానే మిగిలిందన్నారు. ఇప్పుడు కేబినెట్ నోట్ వచ్చిందని, అది అసెంబ్లీకి రాకముందే సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని తాము గట్టిగా అడుగుతున్నామన్నారు. అందుకోసమే తాము ఈ రోజు మరోసారి గవర్నర్‌ను కలిశామన్నారు. ఉద్యమాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ప్రశ్నించారు.

YS Jagan

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి విభజన కోసం నిరాహార దీక్ష చేయగా, కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో ఉద్యోగ సంఘాలతో సమ్మెను విరమింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలను భయపెట్టి సమ్మె విరమింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించారు. గతంలో సమైక్యమన్న కేంద్రమంత్రులు ఇప్పుడు దానిని పక్కన పెట్టి ప్యాకేజీలు కావాలన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్సించారు.

సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నేతల తీరు చూస్తుంటే వీరు అసలు మనుషులేనా అనిపిస్తోందన్నారు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధానిని చేసేందుకు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, చంద్రబాబు అందుకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఇక కిరణ్ అధినేత్రి గీసిన గీతను దాటరన్నారు. ఇలాంటి వారు మనుషులా అన్నారు. బాబు, కిరణ్‌లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. బాబు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thursday lashed out at TDP chief Nara Chandrababu Naidu and CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X