Viral Video: రోజాకు బ్యాటింగ్ నేర్పించిన జగన్ ! ఆడుదాం ఆంధ్రలో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీంతో ఆమె కూడా అన్న చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Recommended Video


మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న... సీఎం జగన్...!!#RojaSelvamani #RKRoja #AadudamAndhra #CMYSJagan #YSJagan #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/ad2fxJLSVo
— oneindiatelugu (@oneindiatelugu) December 26, 2023
సీఎం వైఎస్ జగన్ తొలుత క్రికెట్ పిచ్ పై బ్యాటింగ్ చేయమంటూ బ్యాట్ చేతికి ఇచ్చి మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు. అనంతరం బ్యాట్ పట్టుకున్న రోజాకు పిచ్ పై దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం జగన్ క్రీజులో బ్యాట్ ఎక్కడ ఉంచాలో, క్రీజులో ఎలా నిలబడాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు. దీంతో ఆమె కూడా అంతే ఓపిగ్గా బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించారు.
ఓసారి క్రీజులో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతినే ఆర్కే రోజా క్లీన్ షాట్ కొట్టేశారు. దీంతో అక్కడే ఉన్న సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు చప్పట్లతో ఆమెను అభినందించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సీఎం జగన్ కూడా తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టారు. తద్వారా అక్కడ ఉన్న క్రికెట్ క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications