రేపు ఏలూరు సిద్ధం సభలో జగన్ చెప్పేది ఇదే ? మిథున్ రెడ్డి హింట్ ..!
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ క్యాడర్ ను సిద్దం చేసేందుకు సీఎం జగన్ సిద్ధం పేరుతో ప్రాంతీయ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సిద్ధం సభ నిర్వహించిన జగన్.. రేపు ఏలూరులో రెండో సభ నిర్వహణకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భీమిలిలో జరిగిన సభ కంటే గొప్పగా రాష్ట్రంలోనే అతి పెద్ద సభగా దీన్ని నిర్వహిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో రేపటి ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారు ? భీమిలి సభలో చెప్పిన విషయాలే చెప్తారా లేక మరేదైనా చెప్పబోతున్నారా అనే ప్రశ్నలకు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఇవాళ సమాధానం చెప్పారు. రేపు 150 ఎకరాల్లో భారీ ఎత్తున నిర్వహించే వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. ఇందులో జగన్.. పార్టీ క్యాడర్ కు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా గెలవాలో చెప్తారని మిథున్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే భీమిలి సభలో తన వాడీ వేడీ ప్రసంగంతో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపిన వైఎస్ జగన్.. రేపటి ఏలూరు సభను కూడా అంతకు మించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో ఏలూరులో జగన్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ క్యాడర్ లో పెరుగుతోంది. అలాగే భీమిలి సభకు మించి ఇక్కడ జన సమీకరణ కూడా చేస్తున్నారు. దీంతో ఈ భారీ సభలో సీఎం జగన్ సుదీర్ఘంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications