YS Jagan 2.0: వైఎస్ జగన్ భారీ ప్లాన్- క్యాడర్ నుంచే మొదలు-భీమిలిలో ఫుల్ క్లారిటీ !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ క్యాడర్ లో కొన్ని కీలక అంశాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా విపక్షాల పొత్తులు, వైఎస్ షర్మిల ఎంట్రీతో తిరిగి అధికారంలోకి వస్తామా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వీటిని మొగ్గలోనే తుంచేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. విశాఖలోని భీమిలి వేదికగా ఎల్లుండి నిర్వహించే "సిద్ధం" సభ ద్వారా అన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు, క్షేత్రస్ధాయిలో పరిస్ధితి ఎలా ఉన్నా మీడియాలో మాత్రం కనిపిస్తున్న దూకుడు, మరోవైపు వైఎస్ షర్మిల ఎంట్రీతో వైసీపీకి జరిగే నష్టం ఏంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ లోనూ పలు చోట్ల ఇదే గందరగోళం నెలకొంటోంది. దీంతో ముందుగా క్యాడర్ కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ ఇవాళ భీమిలిలో కీలక సభను ప్లాన్ చేశారు. తొలిసారిగా క్యాడర్ తో నేరుగా మాట్లాడి కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు.

ఐప్యాక్ ఇచ్చిన "సిద్దం" ప్లాన్ తో ఏపీలో వచ్చే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి తాము అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారు. ఓ రకంగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు జగన్ రెడీ అయినట్లే. ఇవాళ్టి నుంచి వరుసగా జిల్లాల్లో సభలు నిర్వహించి ముందుగా క్యాడర్ కు క్లారిటీ ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఇందుకు సిద్ధం అనే టైటిల్ తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. భీమిలి సభ కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లన్నీ ఇప్పుడు ఇదే పేరుతో కనిపిస్తున్నాయి.
భారీ స్లోగన్లకు భిన్నంగా కేవలం సిద్ధం (రెడీ) అన్న టైటిల్ నే జనంలోకి తీసుకెళ్లి దాంతోనే క్యాడర్ కు, ఆ తర్వాత ఓటర్లకు క్లారిటీ ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేశారు. జగన్ పిడికిలి గుర్తుతో నిలబడి ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు విశాఖలో కనిపిస్తున్నాయి.

తన కార్యకర్తలు ఈ సమావేశాలకు కదిలిరావాలని జగన్ పిలుపునిచ్చేలా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎలాంటి సవాళ్లనైనా, పొత్తులనైనా, కుట్రలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతం వీటి ద్వారా జగన్ ఇస్తున్నారు.
అలాగే ఈ పోస్టర్ లో క్యాడర్ కూడా తమ నాయకుడితోపాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ, చేతులు పైకెత్తినట్లు రూపొందించారు. ఇప్పటికే జనమే తన స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించిన జగన్.. అందుకు తగ్గట్టుగానే పోస్టర్లలోనూ అదే భావం స్ఫురించేలా రూపొందించారు. రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ ని సెట్ చేయడానికి ఈ పోస్టర్లు సిద్ధం చేశారు.

ఈ హోర్డింగ్‌లు ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ సిద్ధం పేరుతో మొత్తం నాలుగు భారీ క్యాడర్ మీటింగ్స్ కు ప్లాన్ చేసింది. ఇందులో 27న భీమిలిలో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారు.












Click it and Unblock the Notifications