కీలక నేతలకు జగన్ పిలుపు - గెలిచే నెంబర్ ఇదే, నెక్స్ట్ ఇలా..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారం చేపడతారా. జగన్ చెబుతున్నట్లుగా 2019 కంటే ఎక్కువ సీట్లు దక్కుతాయా. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఈ ఉత్కంఠ పెరుగుతోంది. విదేశీ పర్యటన ముగించుకొని జగన్ తాడేపల్లికి రిటర్న్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలకు జగన్ నుంచి పిలుపు వచ్చింది. ఓటింగ్ సరళి పరిశీలించిన తరవాత పార్టీ సాధించే సీట్ల పైన ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశం పై జగన్ మరోసారి క్లారిటీ ఇవ్వనున్నారు.
జగన్ ధీమా
ముఖ్యమంత్రి జగన్ గెలుపు పైన ధీమాగా ఉన్నారు. 15రోజుల విదేశీ పర్యటన ముగించుకుని రేపు ఏపీకి రాబోతున్నారు సీఎం జగన్. జగన్ పునరాగమనంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మళ్లీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ జగన్ వేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. జూన్-9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ సీనియర్ నేతలు ఇదివరకే ప్రకటించారు. వచ్చీరాగానే మీటింగ్.. రేపు(శనివారం) ఉదయం 5 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కి రానున్నారు.

పార్టీ నేతలకు పిలుపు
పార్టీ కీలక నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కౌటింగ్ పై పార్టీ నేతలతో ఆయన భేటీ అవుతారు. ఫలితాలకు మూడు రోజుల ముందు జరిగే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. జగన్ విదేశాల్లో ఉండగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి వీడియో బయటకు రావడం, ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం, రాష్ట్రంలో కొన్నిచోట్ల కీలక బదిలీలు, పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ న్యాయపోరాటం... ఇలా ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపై ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. రేపు నేరుగా పార్టీ కీలక నేతలతో ఆ సమాచారంపై చర్చించనున్నారు.
గెలుపు అంచనాలు పక్కా
ఇక..పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని చెబుతున్న జగన్..ఎన్ని సీట్లలో గెలుస్తున్నారనేది ఇప్పటికే అంచనాలు వెల్లడించారు. ఐ ప్యాక్ సమావేశంలో 2019 లో గెలిచిన స్థానాలు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. అనేక సర్వే సంస్థలు..క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా ఆ లెక్కలు జగన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనూ పలువురు ముఖ్య నేతలు జగన్ తో టచ్ లోకి వెళ్లారు. ఆ సమయంలోనూ తాను గతంలో చెప్పిన నెంబర్ రాబోతోందని జగన్ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో..ఇక, శనివారం జరిగే ముఖ్య నేతల సమావేశంలో జగన్ అధికారం పైన ఏం చెప్పబోతున్నారనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications