రూటు మార్చిన జగన్ , సర్వే ఎఫెక్ట్ - ఆ నియోజకవర్గాలపై గురి..!!
ఏపీ ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. జగన్ ఈ నెల 28 నుంచి మలి విడత ప్రచారం ప్రారంభించనున్నారు. రేపు (శనివారం) ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు నిర్ణయించారు. అటు టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. జగన్ తన ఎన్నికల ప్రచారంలో కొత్త రూటులో వెళ్తున్నారు. సర్వేల ఆధారంగా ప్రచారం చేయాల్సిన నియోజక వర్గాలను ఎంపిక చేసుకున్నారు.
జగన్ ప్రచార యాత్ర
ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. టీడీపీ కూటమి బలంగా ఉన్న నియోజకవర్గాలు, హోరా హోరీ పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ప్రచారానికి సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. దాదాపు 45 నియజకవర్గాల్లో జగన్ ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. మే 11వతేదీ వరకు ప్రచారం కొనసాగనుంది. తొలి రోజున తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం చేయనున్నారు. అదే విధంగా ...29న చోడవరం, పో. గన్నవరం, పొన్నూరులో ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ ప్రచార సభలకు నిర్ణయించారు. మూడో రోజున కొండపి, మైదుకూరు, పీలేరు నియోకజవర్గాల్లో పర్యటించేలా జగన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది.

45 నియోజకవర్గాల పై గురి
మే 1వ తేదీన బొబ్బలి, పాయకరావు పేట, ఏలూరులో జగన్ ప్రచారం కొనసాగనుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు అవకాశాల పైన జగన్ ఏడు రకాల సర్వేలు చేయిస్తున్నారు. ఆ నివేదక ల ఆధారంగా ఇప్పుడు తన ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాల పైన అంచనాకు వచ్చారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కూటమి తో హోరా హోరీగా ఉన్న 12 నియోజకవర్గాలను జగన్ సర్వేల ద్వారా గుర్తించారు. ఆ నియోజకవర్గాల్లో ప్రచారం తో పాటుగా ఓటింగ్ పైన అభ్యర్దులను జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. బస్సు యాత్ర సమయంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్దులను జగన్ కీలక సూచనలు చేసారు.

సర్వే నివేదికల ఆధారంగా
రోజు రోజుకీ వస్తున్న నివేదికలు...నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు జగన్ ప్రచారం పైన ఫోకస్ చేసారు. రేపు మేనిఫెస్టోలోనూ కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను జనాలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక..స్థానికంగా సామాజిక సమీకరణాలు..ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలకు అనుగుణంగా కౌంటర్ స్ట్రాటజీ అమలు పైన జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రచారం చివరి మూడు రోజులు కేటాయించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీం ఆపరేషన గోదావరి అమలు చేస్తోంి. దీంతో...జగన్ మేనిఫెస్టో..ప్రచార సరళి పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications