Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైభవంగా జరుగుతున్న విశాఖ శారదాపీఠం ఉత్సవాలు.. రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్‌

విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహించిన రాజ శ్యామల యాగంలో పాల్గొన్నారు. శారదా పీఠంలో వార్షికోత్సవాల సందర్భంగా మూడు రోజులుగా రాజ శ్యామల యాగం కొనసాగుతోంది. లోకకల్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజ శ్యామల యాగం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం నాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠం లో రాజ శ్యామల యాగంలో పాల్గొన్నారు.

శారదా పీఠం రాజశ్యామల యాగంలో పాల్గొన్న వైఎస్ జగన్

శారదా పీఠం రాజశ్యామల యాగంలో పాల్గొన్న వైఎస్ జగన్

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖకు వెళ్లారు. ఓడరేవు నగరంలో ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం వరకు శ్రీ విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం 'మహోత్సవం'లో పాల్గొన్నారు. అంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు, మేయర్ జి హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ ఎ మల్లికార్జున, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర, ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, బి సత్యవతి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి పెందుర్తిలోని చిన్నముషిడివాడలో ఉన్న శారద పీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే 'రాజశ్యామల పూజ' తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

 వైఎస్‌ జగన్‌తో సంకల్పం; తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన

వైఎస్‌ జగన్‌తో సంకల్పం; తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన

సీఎం జగన్మోహన్ రెడ్డికి శారదా పీఠం వార్షిక ఉత్సవాల సందర్భంగా పూర్ణకుంభంతో వేదపండితులు ఘన స్వాగతం పలికారు. శారద పీఠానికి చేరుకున్న సీఎం అక్కడ రాజ శ్యామల యాగం లో పాల్గొని పూజాదికాలను నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. వైఎస్‌ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి రాజ శ్యామల యాగం లో పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శారదాపీఠం పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Recommended Video

    Statue Of Equality : Special Events Will Be Conducted For 10 Days | Oneindia Telugu
    జగన్ పర్యటనలో శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజుకు అవమానం

    జగన్ పర్యటనలో శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజుకు అవమానం


    ఇదిలా ఉంటే విశాఖ శారదా పీఠం వద్ద మంత్రి సీదిరి అప్పల రాజుకు ఘోర పరాభవం జరిగింది. శారదా పీఠం లోకి మంత్రి వెళ్లేందుకు ప్రయత్నించగా మంత్రి సిదిరి అప్పలరాజు ను అడ్డుకున్న పోలీసులు పాసులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. జగన్ శారద పీఠానికి వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున వైసిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+