పవన్ ఏంటీ డ్రామాలు, వదిలేది లేదు - జగన్ వార్నింగ్..!!

మాజీ సీఎం జగన్ మరో పోలీసు అధికారికి హెచ్చరిక చేసారు. రూల్సకు విరుద్దంగా ప్రభుత్వ మెప్పు కోసం పని చేస్తే ఊరుకొనేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలను వేధిస్తూ సమస్యలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని జగన్ చెప్పుకొచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటన పైనా జగన్ మరోసారి సీరియస్ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం తీరును తప్పు బట్టారు. క్షమాపణ చెబితే చాలంటూ పవన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

మా ప్రభుత్వమే వచ్చేది
మాజీ సీఎం జగన్ తమ పార్టీ నేతలను అక్రమంగా వేధిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తాజా గా పులివెందుల పర్యటన సమయంలో పార్టీ నేతలు తమను డిఎస్పీ టార్గెట్ చేసి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగన్ కు ఫిర్యాదు చేసారు. దీంతో, బెంగళూరుకు బయల్దేరి వెళ్లే సమయం లో హెలికాప్టర్‌ వద్ద పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిచి మాట్లాడారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉంటుందనుకోవద్దని సూచించారు. మళ్లీ తాము వచ్చినపుడు వైసీపీ వారిని ఇబ్బంది పెట్టిన వారందరినీ ప్రత్యేక దృష్టితో చూస్తామంటూ హెచ్చరించారు. డీఎస్సీ తాము ఎవరి మాటలు విని కేసులు నమోదు చేయటం లేదని.. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా, జగన్ మాత్రం రూల్స్ ప్రకారం వ్యవహరించాలని.. ఎవరి కోసమే పని చేస్తే భవిష్యత్ లో ఇబ్బంది తప్పదని స్పష్టం చేసారు.

YS Jagan Warn for Pulivenduala DSP to stick to the duties demands action against TTD chairman

వారిని తొలిగించాలి
ఇక, తిరుపతి తొక్కిసలాట ఘటన పైన జగన్ మరోసారి సీరియస్ అయ్యారు. ఘటనకు సంబం ధించిన బాధ్యులపై చర్యల విషయంలో చంద్ర‌బాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందన్నారు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలినా..వారి విషయంలో చర్యలు ఎందుకు లేవని జగన్ ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం అని జగన్ వ్యాఖ్యానించారు. తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కాదా అంటూ జగన నిలదీసారు. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం.. తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం డ్రామాలు
ఘటనలో సంబంధం లేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేసారని..అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టారన్నారు. టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా అని జగన్ ధ్వజమెత్తారు.మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్ పదం గా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలం టూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారన్నారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా అంటూ జగన్ మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపాలని జగన్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+