జగన్ మళ్లీ వస్తాడు-బాబు చస్తాడు- వైసీపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు యాత్రలపై యాత్రలు చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేస్తుంటే, చంద్రబాబు వదిలేసిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను ఆయన కుమారుడు లోకేష్ మొదలుపెట్టబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇప్పటికే నాలుగోదశ పూర్తి చేసుకుంది. అటు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. ఇందులో నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి.
చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టారని, ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి ఢిల్లీ యాత్ర చేశారని, పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టి, ఇప్పుడు వదిలిపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్రను ఆపలేరన్నారు. 2024లో జగన్ ముఖ్యమంత్రిగా వస్తాడని, చంద్రబాబు చస్తాడని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పంచాయతీ నుంచి మండలాలు, జడ్పీ, మంత్రివర్గం వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలంతా జగన్ మోహన్ రెడ్డి పక్షానే ఉంటారని తెలిపారు. ఈ రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలవబోతున్నామని మాధవ్ చెప్పుకొచ్చారు. సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొన్న మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ మళ్లీ వస్తాడు.. బాబు చస్తాడు - వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు..!!#GorantlaMadhav #YSJagan #CMJagan #Chandrababu #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/tqB8Vvs6Y9
— oneindiatelugu (@oneindiatelugu) October 27, 2023
రాష్ట్రంలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ స్కాం కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో ఉంటున్న చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న వేళ.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మాధవ్ ఏ సమాచారంతో ఈ ఆరోపణలు చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications