నుదుటిన కస్తూరి తిలకం..
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు.
ఉమ్మడి గుంటూరు తర్వాత.. చిత్తూరు జిల్లాలో పర్యటించారు జగన్. చంద్రబాబు సొంత జిల్లా ఇది. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. వారికి అండగా నిలిచారు. తన సంఘీభావాన్ని తెలియజేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

ఇక తాజాగా మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నారు. ఈ నెల 31వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు, కోవూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారించనున్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డికి ధైర్యం చెప్పాలని, ఆయనకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ నెల 3వ తేదీ నాడే జగన్ నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నప్పటికీ- అది సాధ్యపడలేదు. జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకుంటామని, ఆయన హెలికాప్టర్ ను దిగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
దీంతో తాత్కాలికంగా జగన్ తన నెల్లూరు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడీ పర్యటన ఈ నెల 31వ తేదీన జగన్ చేపడతారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.












Click it and Unblock the Notifications