Ys Jagan Stone Attack: రాయి దాడిపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ఏపీలో మేమంతా సిద్దం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు.
దీంతో నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూలనుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వీరితో జగన్ పిచ్చాపాటీ మాట్లాడారు. తనపై రాయి దాడి తర్వాత తొలిసారి జగన్ చేసిన వ్యాఖ్యలతో నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి సీఎం జగన్ ఇవాళ సాయంత్రం గుడివాడలో జరిగే సభలో రాయి దాడిపై స్పందించనున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications