బాలయ్యను నేనే తీసుకెళ్లా-ఆ ఒక్కమాటతో..! వైఎస్ బామ్మర్ది షాకింగ్..!

ఏపీ అసెంబ్లీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు గతంలో జరిగిన మరిన్ని పరిణామాల్ని తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ ను ఉద్దేశించి బాలకృష్ణ సైకో అని వ్యాఖ్యానించడం, గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి సహా ఇండస్ట్రీ పెద్దల భేటీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల తర్వాత మెగా అభిమానులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఆయనపై మండిపడ్డాయి. దీంతో బాలయ్య గతంలో తెచ్చుకున్న మెంటల్ సర్టిఫికెట్ వంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలో గతంలో బాలయ్య మెంటల్ సర్టిఫికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బావమరిది, వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. బాలయ్యను ఈ కేసు నుంచి కాపాడేందుకు తన బావ వైఎస్సార్ వద్దకు తానే ఆయన్ను తీసుకెళ్లినట్లు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

YS Jagan s Uncle Reveals Taking Balakrishna to YSR to Intervene in Firing Case

బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉందని ఆయనని కాపాడమని తానే రాజశేఖర్ రెడ్డి దగ్గరకి తీసుకెళ్ళానని రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఆయన బంధువులు ఎవరూ కాపాడడానికి రాలేదన్నారు. చంద్రబాబు అయితే తరువాత రోజు వచ్చారన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయి బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది, అందుకే కాల్పులు జరిపాడు అరెస్టు చేయొద్దని జైలుకి వెళ్లకుండా ఆపానన్నారు. దీంతో బాలయ్య ఈ కేసు నుంచి బయటపడినట్లు తెలిపారు.

YS Jagan s Uncle Reveals Taking Balakrishna to YSR to Intervene in Firing Case

తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ పై చేసిన సైకో వ్యాఖ్యల తర్వాత గతంలో ఆయన్ను వైఎస్ ఎలా కాల్పుల కేసు నుంచి కాపాడారన్న దానిపై వైసీపీ శ్రేణులు పలు అంశాల్ని తెరపైకి తెస్తున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్ బావమరిది అయిన రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా తానే బాలయ్యను ఆయన వద్దకు తీసుకెళ్లి కాపాడినట్లు బయటపెట్టడం సంచలనంగా మారింది. గతంలో లక్ష్మీపార్వతి కూడా తాను బాలయ్యను కాపాడమని వైఎస్ ను కోరినట్లు పలుమార్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ బావమరిదే ఈ విషయం బయటపెట్టడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+