షర్మిలకు రాహుల్ బిగ్ టాస్క్ - అపరేషన్ షురూ, టచ్ లో సీనియర్లు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టార్గెట్ జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ నుంచి కదలిక మొదలైంది. త్వరలోనే పొత్తుల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏపీలో కాంగ్రెస్ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. షర్మిలకు ఏపీలో పాత్ర..టాస్క్ పైన రాహుల్ స్పష్టత ఇచ్చారు.
Recommended Video

కాంగ్రెస్ లోకి షర్మిల : ఏపీలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాలతో ఇప్పుడు ఏపీలోనూ పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా షర్మిల సేవలు ఏ విధంగా ఏపీలో వినియోగించుకోవాలనే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చింది. జవనరి 3న షర్మిల కాంగ్రెస్ లో చేరటం లాంఛనంగా మారుతోంది. రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు షర్మిలకు అప్పగించే అంశం పైన రాహుల్ పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దాదాపు అందరూ అంగీకారం తెలిపారు. ఇదే విషయం పైన షర్మిల భర్త అనిల్ తోనూ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

మాజీలకు ఆహ్వానం : దీంతో, షర్మిలతో నేరుగా చర్చించాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. ఈ నెల 3న షర్మిల ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో షర్మిలను బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఈ మేరకు రాహుల్ కు సూచించారు. కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయిస్తే పార్టీలో జోష్ వస్తుందని ముఖ్య నేతలు పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించారు. కానీ, షర్మిల మాత్రం పోటీకి సుముఖంగా లేరని చెబుతున్నారు. షర్మిల పోటీకి అంగీకరిస్తే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతల సమాచారం. ఏపీలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ కనీసం 15 శాతం ఓట్ షేర్ సాధించటమే లక్ష్యంగా పని చేయాలని ఇప్పటికే షర్మిలతో జరిగిన ప్రాధమిక చర్చల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన టాస్క్ గా చెబుతున్నారు.

షర్మిలకు కీలక బాధ్యతలు : ఇక, కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ..బాధ్యతల పైన చర్చ సాగుతున్న వేళ పార్టీలో చేరికల పైన కసరత్తు మొదలైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ నెల 8న ఏపీకి రానున్నారు. ఏపీలో ఎన్నికల వ్యూహాల పైన చర్చించనున్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసి ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న వారిని తిరిగి సొంత గూటికి రావాలని ఆహ్వానిస్తున్నారు. కొందరు నేతలతో స్వయంగా ఠాగూర్ మంతనాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిలకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. ఇదే తరహాలో మరో అయిదుగురు సీనియర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక..షర్మిల పార్టీలో చేరిన తరువాత ఏపీలో కాంగ్రెస్ నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications