రాహుల్ గాంధీ ట్వీట్ కు వైఎస్ షర్మిల ఎమోషనల్ రిప్లై...

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని విలీనం చేయబోతున్నారని, ఆ తర్వాత ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు కట్టబెడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ వార్తల్ని బలపరిచే ఓ ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ పెట్టిన ఓ ట్వీట్ కు వైఎస్ షర్మిల స్పందించి తన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతే కాదు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ ట్వీట్ లో షర్మిల ప్రస్తావించారు.

ys sharmila

ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్సీపీ, వైఎస్సార్టీపీలతో పాటు ఎంతోమంది ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కూడా ఇడుపుల పాయకు వెళ్లి ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. మహానేత సేవల్ని అంతా గుర్తుచేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఒకప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు.

ys sharmila
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు అంటూ రాహుల్ గాంధీ వైఎస్సార్ భారీ ఫొటో పెట్టి ఇవాళ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఆయన ఎల్లప్పుడూ స్మరించబడాలంటూ ఆకాంక్షించారు. దీనిపై వైఎస్ షర్మిల ఉద్వేగంగా స్పందించారు.

దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు రాహుల్ గాంధీజీ అంటూ వైఎస్ షర్మిల రిప్లై ఇచ్చారు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అన్నారు. ఆయన సంక్షేమం యొక్క నమూనా నేటికీ దేశవ్యాప్తంగా దేశమంతటా ప్రాధాన్యమైన పాలనా నమూనాగా ఉందన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్ అంటూ షర్మిల ట్వీట్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+