కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు? షర్మిల ఎంట్రీ; జగన్ వ్యాఖ్యల వెనుక.. ఆసక్తికర చర్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది.
ఇక ఈ పరిస్థితులలో నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, కొత్త పొత్తుల పైన ఆయన మాట్లాడడం, పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలోనే కాదు ఏపీ ప్రజలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అసలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏమిటి? పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు అన్న ఆయన వ్యాఖ్యల మర్మం ఏమిటి?

రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని, కొత్త పొత్తులు పెట్టుకుంటారని, అబద్ధాలు చెబుతార,ని మోసాలు చేస్తారని సీఎం జగన్ ఎందుకు చెప్పారు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనతో పొత్తులు పెట్టుకున్న టిడిపి బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీతో టిడిపి పొత్తు వ్యవహారం ఇంకా తేలాల్సి ఉంది.
ఇక ఇదే సమయంలో జగన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వైయస్సార్ షర్మిలను స్వాగతించి రంగంలోకి దింపుతున్నారు అన్న సమాచారం పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న వేళ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తారా? కుటుంబాలను చీల్చి పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతాయని జగన్ చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా అన్న చర్చ ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతుంది.
అయితే వైయస్ షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీ నూతన జవసత్వాలు నింపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోతుందని ప్రతిపక్ష కూటమికి ఎదురు దెబ్బ తగులుతుందని అది అధికార పక్షానికి లబ్ధి చేకూరుస్తుందని చర్చ కూడా సాగుతుంది. ఒకవేళ బిజెపి టిడిపి తో పొత్తు పెట్టుకోకపోతే, కాంగ్రెస్ టిడిపి తో కలిస్తే జగన్ కు దెబ్బ తగిలే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం వైఎస్ షర్మిల చేరికతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications