వైఎస్ జగన్ , పీఎం మోడీ, కేసీఆర్ .. ఎవరైనాసరే వైఎస్ షర్మిల ఎటాకింగ్ స్టైలే వేరు

వైయస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ వైయస్ షర్మిల వాగ్దాటి.. ఆమె ప్రత్యర్థులకు పంపిస్తున్న బహుమానాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అద్దం బహుమతిగా పంపిన వైఎస్ షర్మిల, ఇక తాజాగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రేడియోను బహుమానం ఇచ్చారు.

ప్రధాని మోడీకి షర్మిల గిఫ్ట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని, అందుకే ఆయనకు రేడియోను బహుమానంగా పంపుతున్నట్టు వైయస్ షర్మిల పేర్కొన్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. మోదీ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్టు పేర్కొన్న షర్మిల, ఎన్నికల కోసం మోడీ ఏపీ పై కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు.

YS Sharmila gifted radio to pm modi previously Mirror gifted to ys Jagan

జగన్ కు అద్దం గిఫ్ట్ ఇచ్చిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ ప్రజల చార్జిషీట్ ను విడుదల చేసిన షర్మిల, మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అద్దం బహుమతిగా పంపిన వైఎస్ షర్మిల జగన్ అందులో మొహం చూసుకోవాలని, అందులో ఆయనకు ఆయన మొహం కనిపిస్తుందా లేక చంద్రబాబు మొహం కనిపిస్తుందా అని ప్రశ్నించారు.

జగన్ మానసిక స్థితిపై వ్యాఖ్యలు చేసి అద్దాన్ని పంపిన షర్మిల
చంద్రబాబుతో చేతులు కలిపినట్టు ఆధారమైనా, ఒక సాక్ష్యం అయిన చూపించగలరా అని ప్రశ్నించిన ఆమె, జగన్ మానసిక స్థితి గురించి తనకు భయంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ గారు అద్దం చూసుకోండి.. మీకు మీ మొహం కనిపిస్తుందా.. చంద్రబాబు మొహమే కనిపిస్తుందా అంటూ ప్రశ్నించిన షర్మిల ఆయనకు అద్దాన్ని బహుమతిగా పంపుతున్నాను అన్నారు.

గతంలో కేసీఆర్ కు షూస్ గిఫ్ట్
గతంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాలు చేసిన సమయంలో కూడా వైయస్ షర్మిల తన పాదయాత్రను అడ్డుకున్న క్రమంలో, నాటి సీఎం కెసిఆర్ కు షూస్ గిఫ్ట్ గా పంపి ఆ షూస్ వేసుకొని తనతో ఒకరోజు తనతో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఇలా షర్మిల రాజకీయాలలో సమయానుకూలంగా ప్రత్యర్థులకు గిఫ్టులు పంపడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోదీకి రేడియోను బహుమానంగా షర్మిల చెప్పడం రాజకీయాలలో ఆమె స్టైలే వేరు అన్నది మరోమారు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+