అక్కడ 5 వేల గుళ్లెందుకు ? ఆరెస్సెస్ కోసమేనా..! వైఎస్ షర్మిల ఫైర్..!

ఏపీలో కూటమి సర్కార్ పై క్రమంగా విమర్శల దాడి పెంచుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో బాంబు పేల్చారు. రాష్ట్రంలోని దళిత వాడల్లో 5 వేల ఆలయాలు నిర్మించాలన్న టీటీడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వీటిలో దళితుల్ని పూజారులుగా నియమిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆరెస్సెస్ వాదిగా మారిపోయి, వారి అజెండాను అమలు చేస్తున్నారని ఆక్షేపించారు.

చంద్రబాబు ఆరెస్సెస్ మనిషిలా మారారని, బీజేపీ సిద్ధాంతాలను నెత్తిన ఎత్తుకున్నారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు రైటిస్ట్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. బీజేపీ ఒక మత తత్వ పార్టీ అని, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ అని విమర్శించారు.
మిత్ర ధర్మం ముసుగులో చంద్రబాబు ఆరెస్సెస్ లో పూర్తిగా చేరిపోయారని తెలిపారు. అందుకే ఆరెస్సెస్ వాది లా మాట్లాడుతున్నారన్నారు. దళితవాడల్లో 5 వేల గుడులు కావాలని ఎవరు అడిగారని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు గుడులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీటీడీ చాలా పవిత్రమైన దేవాలయమని, దీన్ని ఎవరు కాదనరన్నారు.

YS Sharmila Hits Out at TTD s 5K Temple Proposal in Dalit Colonies Demands Priority to infra

టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే దళితవాడలను అభివృధి చేయొచ్చు కదా అని అడిగారు . రాజ్యాంగానికి వ్యతిరేకంగా RSS సిద్ధాంతాన్ని నెత్తిన ఎత్తుకొని దేశ వ్యాప్తంగా గుడులు కట్టడం సరికాదన్నారు. మన ప్రజాస్వామ్యం సెక్యులరిజమని,
అన్ని మతాలకు స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చిందని గుర్తుచేశారు. దేశంలో ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. ఆరెస్సెస్ రాజ్యాంగంలో హిందువులు మాత్రమే మనుషులు అన్నారు. మిగతా మతస్తులు అంతా పురుగులుగా వారి రాజ్యాంగం చూస్తుందన్నారు.

YS Sharmila Hits Out at TTD s 5K Temple Proposal in Dalit Colonies Demands Priority to infra

దళితవాడల్లో గుడులు కడితే అక్కడ పూజారులు ఎవరు ఉంటారని షర్మిల ప్రశ్నించారు. బ్రాహ్మణులను పెడతారా ? దళితులను పూజారులు చేస్తారా ? అని అడిగారు. చంద్రబాబు కి దళితుల మీద శ్రద్ధ ఉంటే వారి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉమెన్ వెల్ఫేర్ హాస్టల్ లో 200 వందల మందికి ఒకటే బాత్ రూమ్ ఉందని ఈ మధ్య హైకోర్ట్ చెప్పిందన్నారు. గుడులకు బదులు హాస్టల్లో వసతులను కల్పించాలన్నారు. ఆ బిడ్డల గురించి ఫోకస్ చేయాలన్నారు.
దళిత కాలనీల్లో పారిశుధ్యం మీద దృష్టి పెట్టాలని, వారికి కావలసిన కనీస వసతులను మెరుగు పర్చాలని కోరారు. 5 వేల గుడులు కట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దళితవాడల అభివృద్ధి మీద దృష్టిపెట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+