వైఎస్ రాజారెడ్డి, ప్రియల పెళ్లి వీడియోతో వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్; నెటిజన్లు వదిలిపెడతారా!!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియల వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాహ రిసెప్షన్ కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అత్యంత ఘనంగా శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ, క్రీడారంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు కూడా దూరంగా ఉన్నారు. ఇక తాజాగా వైయస్ షర్మిల రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన షర్మిల ఆ వీడియోలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగిన తీరును, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలంబ్రాల దృశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అయితే ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్ళీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అన్న ప్రశ్న చాలామంది నెటిజన్ల నుండి ఉత్పన్నమవుతుంది.
#RajaPriya
— YS Sharmila (@realyssharmila) February 25, 2024
క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం pic.twitter.com/zrnyOCDV1B
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ తరహా తంతు చేసినట్టుగా కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకు కోసమే షర్మిల కుమారుడికి ముందు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి, ఆపై తలంబ్రాలు పోసి హిందూ పద్ధతిలోనూ వివాహం జరిపించినట్టు పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరైతే ఇంతకు జగన్ అన్నయ్య రాలేదు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వైయస్ షర్మిల షేర్ చేసిన వీడియోలో అత్యంత ఘనంగా సరదాగా, ఎంతో సంతోషంగా, సినిమాటిక్ విధానంలో జరిగిన వైయస్ రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుక కళ్లకు కడుతుంది.
-
23 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications