పురందేశ్వరి రికార్డు అందుకున్న వైఎస్ షర్మిల- ఇద్దరి మధ్యా ఆసక్తికర పోలికలు..!

ఏపీలో తాజాగా పీసీసీ అధ్యక్షురాలిగా నియమించిన వైఎస్ షర్మిల ఓ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి అరుదైన రెండు రికార్డులు అందుకున్నారు.

దీంతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికలతో పాటు ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రతిసారీ పోలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ వీరిద్దరికీ ఏ విషయంలో పోలికలు ఉన్నాయన్నది ఓసారి చూసేద్దాం...

ys sharmila joined purandeswari as both are former cms daughters leading national parties in ap

ఏపీలో వైఎస్ షర్మిల నియామకంతో ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి అందుకున్న ఓ అరుదైన రికార్డును ఈమె కూడా సాధించినట్లయింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిల తండ్రి బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షురాలయ్యారు.

గతంలో వైఎస్సార్ కూడా కాంగ్రెస్ లో కార్యకర్తగా చేరి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవి వరకూ ఎదిగారు. చివరికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిల.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధ్యక్షురాలయ్యారు.

ఇప్పటికే మరో మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీకి రాష్ట్రంలో అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలా మాజీ సీఎం కుమార్తెగా, జాతీయపార్టీకి రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న నేతగా పురందేశ్వరి రికార్డు సృష్టించారు. దీన్ని ఇప్పుడు షర్మిల సమం చేసినట్లయింది. అయితే దివంగత సీఎం వైఎస్సార్ కాంగ్రెస్ లోనే పుట్టి కాంగ్రెస్ తోనే జీవించి, కాంగ్రెస్ నేతగానే చనిపోయారు. ఆయన కుమార్తె కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనే పీసీసీ ఛీఫ్ అయ్యారు.

కానీ పురందేశ్వరి మాత్రం ప్రాంతీయ పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ కుమార్తె. ఎన్టీఆర్ ప్రస్దానమంతా ప్రాంతీయ పార్టీలతోనే సాగింది. అయితే జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ చివరి వరకూ ప్రాంతీయ పార్టీ నేతగానే బతికారు. కానీ ఆయన మరణం తర్వాత పురందేశ్వరి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్లడమే కాకుండా కేంద్రమంత్రి కూడా కాగలిగారు. ఇప్పుడు మరో జాతీయ పార్టీని ఏపీలో లీడ్ చేస్తున్నారు. ఇదొక్కటే షర్మిలకూ ఆమెకూ మధ్య తేడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+