జగన్ జోస్యానికి షర్మిల కౌంటర్-కడప పోరుపై కీలక సలహా-'బీ' ల చేతుల్లో రిమోట్ కంట్రోల్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం జగన్ కూ, ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలకూ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జాతీయ మీడియా ఇంటర్వ్యూలో కడప లోక్ సభ సీటులో తన సోదరి షర్మిలకు డిపాజిట్లు రావంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీటిపై ఇవాళ షర్మిల స్పందించారు. జగన్ కు తన సోదరిపై అంత బాధ ఉంటే అవినాష్ ను పోటీ నుంచి తప్పించాలని సూచించారు.

కడపలో తాను ఓడిపోతున్నానని జగన్ నిజంగానే బాధపడుతుంటే అవినాష్ ను పోటీ నుంచి తప్పించాలని షర్మిల ఇవాళ ఆయనకు సలహా ఇచ్చారు. వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం వాస్తవమైతే ఆయన్ని ఓడించింది బాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి కుటుంబాలు కాదా అని షర్మిల ప్రశ్నించారు. వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. మరోవైపు మీకు భయం లేకపోతే కడపలో ఇంతమంది ప్రచారం ఎందుకని షర్మిల నిలదీశారు.

ys sharmila reacts to ys jagan s prediction on kadapa election suggest to withdraw avinash

మీకు భయం లేకపోతే వైఎస్సార్ బిడ్డ గురించి ఇంతగా దూషణలెందుకన్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నారు. జగన్ ఈ ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ పోటీ చేస్తుందో అర్దమైనట్లు లేదన్నారు. కేవలం అవినాష్ రెడ్డిని మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే కడపలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పెదనాన్న జార్జిరెడ్డి కొడుకులకో, చిన్నాన్న కొడుకులకే ఇచ్చి ఉంటే నేను పోటీ చేసే దాన్ని కాదన్నారు. బాబాయ్ రక్తం కళ్ల చూసిన, సీబీఐ ఛార్జిషీట్ లో పెట్టిన అవినాష్ కు టికెట్ ఇవ్వడం వల్లే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వివేకా హత్య హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో జగన్ ఇప్పటికీ సమాధానం చెప్పట్లేదని షర్మిల ఆక్షేపించారు. సీబీఐ దర్యాప్తు కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు వద్దన్నారు, కడప ప్రజలకు చెప్పాలన్నారు. అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా చూశాడంట అన్నారు. అలాంటి మనిషిని జగన్ తన అధికారం అడ్డేసి ఎందుకు కాపాడారో వైఎస్ అభిమానులకు సమాధానం చెప్పాలన్నారు.ఐదేళ్లు నిందితుడిని కాపాడటం ఓ ఎత్తయితే మళ్లీ ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో కడప ప్రజలకూ చెప్పాలన్నారు. కడప జరుగుతున్న ఎన్నికలు ధర్మానికీ, డబ్బుకూ, న్యాయానికీ-నేరానికీ మధ్య అని షర్మిల తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్లే అన్నారు.

వైఎస్ పేరు సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చింది కాంగ్రెస్ కాదని, ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే ఏఏజీ పొన్నవోలు అదే పనిగా చేర్చారన్నారు. వైఎస్ పేరు లేకపోతే జగన్ ఈ కేసుల నుంచి బయటపడలేడని హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్నారు.
కొడుకై ఉండి దుర్మార్గంగా తండ్రి పేరును ఛార్జిషీట్ లో చేర్చారని, ఈ పని చేసిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారన్నారు. జగన్ మనిషే వైఎస్ పేరును ఛార్జిషీట్ లో పెట్టించారన్నారు.

కాంగ్రెస్ చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ అని జగన్ అంటున్నారని, వాస్తవానికి జగన్ కు రిమోట్ కంట్రోళ్లపై బాగానే అవగాహన ఉందన్నారు. జగన్ గత ఐదేళ్లలో కేంద్రంలో మోడీ చేతుల్లో, ఇంట్లో తన వారి చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారన్నారు. ఇద్దరి పేర్లూ బీతోనే మొదలవుతాయన్నారు. మోడీ గంగవరం పోర్టును అదానీకి ఇచ్చేయమంటే ఇచ్చేశారని,. వైఎస్ మరణంలో రిలయన్స్ హస్తం ఉందని జగన్ చెప్తే గొడవలు చేసిన వాళ్లు ఇప్పటికీ కేసుల్లో ఉన్నారన్నారు. మణిపూర్ అవిశ్వాస తీర్మానంలోనూ జగన్ మోడీకి రిమోట్ కంట్రోల్ గా పనిచేసారన్నారు. మోడీ దత్తపుత్రుడు జగన్ అని నిర్మలా సీతారామన్ కూడా చెప్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+