ys sharmila versus ys jagan: జగన్ పై మరోసారి షర్మిల మాటల దాడి..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర మాటల దాడి చేసిన పీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల పోలింగ్ తర్వాత శాంతించారు. జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవడంతో తాను కూడా కుమారుడు రాజారెడ్డి దగ్గరికి వెళ్లిన షర్మిల... రాజకీయాలపై విమర్శల జోరు కూడా తగ్గించారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి తిరిగి జగన్ పై మాటల దాడి ప్రారంభించారు.
ఏపీలోని ఏలూరు జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షలు పూర్తి కావడంతో సర్టిఫికెట్ల కోసం స్కూలుకు వచ్చింది. అదే సమయంలో సిబ్బంది లేకపోవడంతో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తోటి విద్యార్ధి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతే కాదు అతని స్నేహితులు నలుగురు వీడియోలు కూడా తీసి బెదిరింపులు మొదలుపెట్టారు. ఇవి శ్రుతిమించడంతో పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు
రంగంలోకి దిగారు.

ఈ ఘటనపై షర్మిల ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో మహిళ భద్రత ఇలా ఉందంటూ ఓ పేపర్ క్లిప్ జోడించి అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మాట్లాడితే నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోందని షర్మిల విమర్శించారు.
నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు
— YS Sharmila (@realyssharmila) May 24, 2024
నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది
లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న… pic.twitter.com/qRzr0bUCsF
లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావన్నారు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారని షర్మిల తెలిపారు..












Click it and Unblock the Notifications