సోనియాగాంధీతో వైఎస్ షర్మిల భేటీ..! మర్చిపోలేని అరుదైన గిఫ్ట్..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇవాళ ఢిల్లీలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. భర్త అనిల్ కుమార్ తో కలిసి ఆమె సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఇందులో తాజా రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పలు అంశాలను సోనియా గాంధీకి ఆమె వివరించారు. అనంతరం తాను స్వయంగా రాసుకున్న ఆత్మకథ బిలాంగింగ్ పుస్తకాన్ని షర్మి అంటూ ప్రేమగా సంబోధించి సోనియా గాంధీ ఆమెకు బహుమతిగా ఇచ్చారు.

ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!
ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!

అనంతరం సోనియా గాంధీ చేతుల మీదుగా ఆత్మకథ పుస్తకాన్ని అందుకున్న తొలి వ్యక్తిగా గర్వంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల తన సంతోషం పంచుకున్నారు. సోనియా గాంధీ గారి నుండి స్వయంగా ఆత్మీయమైన, దయగల వ్యక్తిగత సందేశంతో కూడిన, వ్యక్తిగతంగా సంతకం చేసిన మొట్టమొదటి ప్రతులలో ఒకటైన '#Belonging : A Journey of Love'ను అందుకోవడం తనకు నిజంగా ఒక గొప్ప భాగ్యం, గొప్ప గౌరవం అంటూ షర్మిల ట్వీట్ లో తెలిపారు.

YS Sharmila s Special Moment With Sonia Gandhi Why She Calls Her Signed Book a Precious Keepsake
2004లో అలా ప్రధాని పదవి వదులుకున్నా- ఇంత జరిగింది- ఆత్మకథలో సోనియా సంచలనం..!
2004లో అలా ప్రధాని పదవి వదులుకున్నా- ఇంత జరిగింది- ఆత్మకథలో సోనియా సంచలనం..!

తనకు ఇది కేవలం ఒక పుస్తకాన్ని అందుకోవడం కన్నా ఎంతో ఎక్కువ అన్నారు. మన దేశానికి ఆమె జీవితం, ప్రయాణం, చేసిన సేవలు తరతరాలను ప్రేరేపించిన ఒక నాయకురాలి నుండి లభించిన ఈ ఆదరణను తాను ఎంతో విలువైనదిగా భావిస్తానన్నారు.
ఆమె వ్యక్తిగత ఆలోచనలను చదవడానికి, అలాగే ఆమె అసాధారణ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన అనుభవాలు, భావోద్వేగాలు, దృఢ విశ్వాసాలను తెలుసుకోవడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని షర్మిల తెలిపారు. ఇది ఒక అమూల్యమైన జ్ఞాపిక, నేను జీవితాంతం పదిలపరుచుకునే ఒక మధుర క్షణం అన్నారు. మరోవైపు రాష్ట్రంలో స్దానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా కాలం తర్వాత ఉనికి చాటుకోవడం, ముఖ్యంగా చీరాల మున్సిపల్ ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లను గెల్చుకోవడంపై సోనియాకు షర్మిల వివరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+