గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైయస్ జగన్ వైయస్ షర్మిల ప్రత్యర్థులుగా తలపడడం ఏపీ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎన్నికలు మొదలైన నాటి నుండి నేటి వరకు వైయస్ జగన్, వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ
ఇక తాజాగా విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి పై మరోమారు విరుచుకుపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల ఒక్క ఛాన్స్ ని అడిగితే నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఏపీని నాశనం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాయని వైయస్ షర్మిల విమర్శించారు.

YS Sharmila serious comments YS Jagan made ap without capital

జగన్ వల్లనే ఈ దుస్థితి
వైయస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలో రాజధాని ఎక్కడో చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంది అంటే అది ఏపీనే అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ వల్లనే ఇటువంటి దుస్థితి వచ్చిందని ఆమె విమర్శించారు.

చెప్పిందేంటి .. కానీ చేసిందేంటి?
ఒకసారి అవకాశం ఇస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ని చేస్తానని జగన్ చెప్పారని, కానీ గెలిచిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా చేశాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించాలని వైయస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ అండదండలతో రాష్ట్రంలో వైయస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకొస్తానన్నారు. గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని షర్మిల ఆరోపించారు.

జగన్ వైఎస్సార్ ఆశయాలను పట్టించుకోలేదు
వైయస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్ ఆయన ఆశయాలను పట్టించుకోలేదు. వైయస్ఆర్ ఆశయాలు నిలబెట్టాలంటే రైతును రాజు చేయాలి. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు కట్టించాలి. ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వైయస్ఆర్ వారసులు అవుతారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే వైయస్సార్ పాలన వస్తుందని, అభివృద్ధి జరుగుతుందని అన్నారు వైయస్ షర్మిల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+