జగన్ ను తరిమేస్తే వీళ్లొచ్చి ముంచేశారు.. ! కూటమి ఏడాది పాలనపై షర్మిల ఫైర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్ పాలనతో కూటమి ఏడాది పాలనను పోలుస్తూ వైఎస్ షర్మిల సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో జగన్ కు గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో కూటమిని తెచ్చుకుంటే వారు ఏడాది పాలనలో ఏం చేశారో షర్మిల వివరించారు. అంతిమంగా ప్రజా తీర్పుకు వక్రభాష్యం చెప్పేలా చంద్రబాబు పాలన ఉందన్నారు.
ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు ఏడాది పాలన అని షర్మిల ఆరోపించారు. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారని, గాడిన పెడుతున్నాం అని చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేశారని, అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారని తెలిపారు.

నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారని, కరెంటు బిల్లుల పేరిట జనాల జేబులకు చిల్లులు పెట్టారని షర్మిల విమర్శించారు. విభజన హామీలకు దిక్కులేదని, ప్రత్యేక హోదా అడగలేదని,, పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ
ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదని షర్మిల ఆరోపించారు. అన్యాయమని ప్రశ్నించలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ఉద్ధరిస్తామని చెప్పి, 4 వేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించారని చెప్పుకొచ్చారు.
జూన్ 4: ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు @ncbn గారి ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో…
— YS Sharmila (@realyssharmila) June 4, 2025
వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు తీరని అన్యాయం చేశారని, ఇవ్వాళ ప్రజా తీర్పు దినం కాదని,ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినమని షర్మిల తెలిపారు. నమ్మకం పేరుతో మోడీ, బాబు, పవన్ రాష్ట్ర ప్రజలను వంచించిన దినం అన్నారు. ఇక వైసీపీ నిర్వహించే "వెన్నుపోటు"దినానికీ అర్థమే లేదన్నారు. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని, వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ రైట్స్ , బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసన్నారు.

ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే, అరచేతిలో మళ్ళీ వైకుంఠం చూపిస్తుంటే, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెప్తుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ప్రతిపక్ష హోదా కావాలని, ఇంట్లో ప్రెస్ మీట్ లు పెట్టీ మారం చేసిన వైసీపీ అధినేత జగన్ కూడా వెన్నుపోటు దారుడే అన్నారు. ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, లిక్కర్ స్కాం ఆద్యుడు మీరే అని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్ లైన్ లో కాకుండా క్యాష్ పద్ధతిలో లిక్కర్ సొమ్ము గురించి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుందంటూ చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications