చంద్రబాబు రెండేళ్ల పాలన హామీలు ఘనం..! షర్మిల కామెంట్స్..!
ఏపీలో గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన ఓ హామీ నిలబెట్టుకోవడంలో రెండేళ్లయినా ప్రభుత్వం విఫలమవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కూటమి రెండేళ్ల పాలన హామీలు ఘనం..అమలుకు ఘరానా మోసం అన్నారు. ఏటా జనవరి వస్తోంది.. పోతుందని..సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నా..ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ కి మాత్రం దిక్కులేదని షర్మిల విమర్శించారు.
రికార్డు చేసి పెట్టుకోండని ఇచ్చిన వాగ్దానానికి విలువ లేదని షర్మిల తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, భారీగా నిరుద్యోగుల ఓట్లు దండుకుని, రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ పై ఊసెత్తకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలని షర్మిల విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందన్నారు.

2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? అని షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటన్నారు. ఇదిగో అదిగో అని ఊరించడం తప్ప ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏదన్నారు.కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు..జోక్ క్యాలెండర్ అన్నారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉన్నది అమ్ముకుని సైతం కోచింగులు తీసుకొంటున్నారని, ఉద్యోగాలు ఇస్తారా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తుచేశారు.

ఆయా ప్రభుత్వ విభాగాల్లో కలిపి ఖాళీలు 2 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా ఉందన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక కొలువులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.
-
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications