జగన్ రెడ్డీ హోదా ఏమైంది, చంద్రబాబుదే ఆ పాపం - షర్మిల ఫైర్..!!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రసంగంలోనే సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను ప్రస్తావించారు. అప్పులపైన నిలదీసారు. హోదా ఏమైంది జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు గ్రాఫిక్స్ తో మోసం చేసారని మండిపడ్డారు. వైఎస్ ఆశయ సాధన కోసం తాను సిద్దమని..తనతో చేతులు కలపటానికి సిద్దంగా ఉన్నారా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Recommended Video

    సీఎం షర్మిల అంటూ దద్దరిల్లిన సభ APCC YS Sharmila Speech | AP Politics | YSRCP | Telugu Oneindia

    షర్మిల కీలక వ్యాఖ్యలు
    వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో తన అన్న పాలన పైన ఫైర్ అయ్యారు. టీడీపీ, వైసీపీ పదేళ్ల పాలనల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పదేళ్ల కాలంలో ఇద్దరి హయాంలో రాష్ట్రానికి అప్పు పది లక్షల కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఒక్క మెట్రో లేదని, చెప్పుకొనే స్థాయిలో ఏ డెవలప్ మెంట్ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో పరిశ్రమలు వచ్చాయా, బిడ్డలకు ఉద్యోగాలు దొరికాయా అంటూ ప్రశ్నించారు. రోడ్లు వేసుకోవటానికి కూడా రాష్ట్రంలో డబ్బుబు లేవని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా అని నిలదీసారు. దళితుల పైన మాత్రం దాడులు వంద శాతం పెరిగాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రలో లిక్కర్, మైనింగ్, ఇసుక మాఫియా ఉందని షర్మిల ఆరోపించారు.

    YS Sharmila Targets CM Jagan and Chandra Babu over support for BJP, and Administration failures

    జగన్, చంద్రబాబు టార్గెట్ గా
    ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందని షర్మిల ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు 15 ఏళ్లు స్టేటస్ కావాలని కోరిన అంశాన్ని గుర్తు చేసారు. నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేసారన్నారు. స్వలాభం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ తాకట్టు పెట్టాయని విమర్శించారు. హోదా లేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్ దేనని షర్మిల చెప్పుకొచ్చారు. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు. ఒక్కటీ లేదని ఎద్దేవా చేసారు. మరి ఏం సాధించారని నిలదీసారు. పోలవరం ను చంద్రబాబు, జగన్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు బీజేపీకి ఎందుకు తొత్తులుగా మారారని నిలదీసారు.

    కలిసి రావాలని పిలుపు
    రెండు పార్టీలు బీజేపీ ఏం చెబితే గంగిరెద్దులుగా మారారని వ్యాఖ్యానించారు. ఒక్క అంశంలో అయినా టీడీపీ, వైసీపీ బీజేపీని వ్యతిరేకించిందా అని ప్రశ్నించారు. మణిపూర్ లో క్రైస్తవుల పై వివక్ష, చర్చిలు కూల్చారాని మండిపడ్డారు. బీజేపీతో వైసీపీ, టీడీపీకి పొత్తులు ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ, టీడీపీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనన్నారు. వైఎస్సార్ ఊపరి, ఆశలు కాంగ్రెస్ తోనేనని స్పష్టం చేసారు. వైఎస్సార్ అభిమానులు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఆశయాలను సాధించేందుకు తాను రెడీ అని..మీరు రెడీనా అంటూ కార్యకర్తలను షర్మిల కోరారు. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ లో చేరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+