రేపు అన్న జగన్ తో షర్మిల భేటీ ? ఫైనల్ గా తేల్చేసే ఛాన్స్ ! అనంతరం ఢిల్లీకి ..
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే ఆ మేరకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపుల పాయ నుంచి తాడేపల్లి చేరుకుని వైఎస్ షర్మిల.. సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు. అనంతరం తాడేపల్లి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత పీసీసీ ఛీఫ్ పదవితో పాటు మరికొన్ని కీలక హామీలు తీసుకున్న వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 4న అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అక్కడే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించబోతున్నారు. ఇవాళ వైఎస్సార్టీపీ భేటీ నిర్వహించిన షర్మిల.. ఆ మేరకు తన అనుచరులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మలి విడతగా అన్న వైఎస్ జగన్ ను కలిసేందుకు షర్మిల సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా షర్మిలకు రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్లాన్ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమైన చెల్లెలికి సీఎం జగన్ ఏదైనా సూచనలు చేస్తారా లేక వద్దని వారిస్తారా, లేక కాంగ్రెస్ లో చేరిక తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై గైడ్ చేస్తారా అన్నది తెలియరాలేదు. ఇప్పటివరకూ అయితే వైసీపీ నేతలు షర్మిల విషయంలో మౌనం పాటిస్తున్నారు.












Click it and Unblock the Notifications