బాలయ్య ఇంట్లో జరిగిన దానికే బాధపడితే.. మీరు చేసిందానికి.. రోజాపై షర్మిల ఫైర్..!

వైసీపీ అధినేత, తన అన్న వైఎస్ జగన్ పై నిత్యం విమర్శలకు దిగుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలపై ఇవాళ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలకు దిగారు. షర్మిలకు రక్త సంబంధాలు తెలియవని, సొంత అన్నపై రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై షర్మిల తిరిగి స్పందించారు. రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెళ్ల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. రక్త సంబంధం విలువ ఏంటో తనకే తెలుసన్నారు

గతంలో బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారానికే తాను బాధపడితే, తన ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి తాను ఎంత బాధ పడి ఉండాలని రోజాను షర్మిల ప్రశ్నించారు. తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని, తాను వైఎస్సార్ కి పుట్టలేదు అని మీ సైతాన్ సైన్యం తో ప్రచారం చేయించారని రోజాకు గుర్తుచేశారు. అన్న అడిగాడు అని,రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, అన్న ను ఎంతో ప్రేమించానని గుర్తుచేశారు. పాప నీ ప్రాణం కావాలని అడిగినా వెంటనే ఇచ్చే దాన్ని అన్నారు. అక్క చెల్లెళ్ళు అనేది మీకు ఊత పదం మాత్రమే అన్నారు.

ys Sharmila s strong counter to rk roja over family relations remark targets brother ys jagan again

చంద్రబాబు కు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్సార్ బిడ్డకు లేదు, రాదని షర్మిల తెలిపారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో రాష్ట్రం అంతా తెలుసన్నారు. ఇన్నేళ్లు బీజేపీ కి జగన్ మద్దతు ఇచ్చాడని, వైఎస్సార్ వ్యతిరేకించిన పార్టీకి ఆయన కొడుకు మద్దతు ఇచ్చాడని గుర్తుచేశారు. మోడీకి జగన్ దత్తపుత్రుడుగా మారాడన్నారు. 5 ఏళ్లు బీజేపీ కి జగన్ ఊడిగం చేశాడని, ప్రతి బిల్లుకు కేంద్రంలో మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

ys Sharmila s strong counter to rk roja over family relations remark targets brother ys jagan again

తల్లిని,చెల్లిని దూరం చేసుకున్న నాడే మీరు మనిషి జాబితా బయటకొచ్చారంటూ జగన్ పై షర్మిల విమర్శలు గుప్పించారు.
మీరు మనుషులు కారని, రక్త సంబంధాల గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని తెలిపారు. విజయమ్మ ను పార్టీ నుంచి వెళ్లగొట్టిన నాడే మీ పతనానికి నాంది పడిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, తాను మద్దతు ఇచ్చేది ఆంధ్రా రాష్ట్రం కోసం
అని, రాష్ట్ర సమస్యల మీద ప్రజా పోరాటాలకు తన మద్దతు ఉంటుందని షర్మిల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+