వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోపల విభజన, పైకి సమైక్యం: కిరణ్‌పై విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిందించారు. కిరణ్ కుమార్ రెడ్డి లోపల విభజనకు సహకరిస్తూ బయటకు సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆమె అన్నారు. జాతీయ మీడియాకు ఆమె శుక్రవారం ఇంటర్వ్యూలు ఇచ్చారు. పై స్థానాల్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గదుల్లో కూర్చుని ఇరు ప్రాంతాల నేతలతో డ్రామాలు ఆడిస్తున్నారని ఆమె విమర్సించారు.

కిరణ్ కుమార్ రెడ్డి రూట్‌మ్యాప్‌లు ఇచ్చారని, మోసపూరితమైన ధోరణితో సమ్మెను విరమింపజేశారని, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నా వాటిని ఆపేశారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం శానససభలో తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం పార్లమెంటులో, న్యాయస్థానాల్లో ఓ ఆయుధంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇప్పటికైనా సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ముందుకు రావాలని ఆమె కోరారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ చగన్ పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలకు ఆర్టికల్ 3, 371డి గురించి వివరించి వారి మద్దతు కూడగట్టారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయగలిగారని విజయమ్మ అన్నారు.

తమకు మద్దతు ఇస్తున్న కాంగ్రెసు సభ్యులపై వేటు వేయడం వల్ల సమైక్యాంధ్రకు మద్దతు తగ్గిందని ఆమె అన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు 175 మంది ఉంటే 15మందిపై వేటు వేశారని ఆమె చెప్పారు. చంద్రబాబు కూడా కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే విభజనకు అడుగడుగునా సహకరిస్తున్నారని విజయమ్మ విమర్శించారు.

English summary
YSR Congress honorary president YS Vijayamma lashed out at CM Kiran kumar Reddy on the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X